- Telugu News Photo Gallery Know these diseases can you affects if you feel dizziness after standing for a while check in telugu
Dizziness: ఎక్కువసేపు నిలబడితే కళ్లు తిరుగుతున్నాయా ? ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి..
సాధారణంగా చాలా మందికి కళ్లు తిరగడం.. తలనొప్పి.. మైకం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఎక్కువ సేపు నిల్చున్నా..కూర్చున్న ఈ సమస్యలు మరింత తీవ్రమవుతుంటాయి. ఎందుకో తెలుసుకుందామా..
Updated on: Apr 25, 2022 | 10:08 AM

కొందరికి ఎక్కువసేపు కూర్చున్నా.. నిల్చున్న కానీ తలతిరగడం, మైకం రావడం.. అలసటగా ఉంటుంది. వీరికి ప్రతిసారి ఇదే సమస్య వేధిస్తుంటుంది. అయితే ఇలా కావడానికి పోషకాహార లోపంతోపాటు.. అనేక కారణాలున్నాయి.

ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్: సరైన జీవనశైలీ, కొన్ని రకాల ఆహారపు అలవాట్ల కారణంగా హైపోటెన్షన్ వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి.. ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ సమయంలో, వ్యక్తిలో BP వేగంగా పడిపోతుంది. దీంతో తలతిరగడం.. స్పృహ కోల్పోతారు.

తలకు గాయం: కొన్నిసార్లు నిల్చున్నప్పుడు మైకము వస్తుంది. దీంతో కింద పడిపోవడం.. లేదా పక్కనే ఉన్న వస్తువులను తగలడం జరుగుతుంది. దీంతో తలకు గాయం కావచ్చు. తలకు తగిలిన గాయం చాలా కాలం పాటు మైకము కలిగిస్తే అప్పుడు వైద్యుడిని సంప్రదించాలి.

చెవి సంబంధిత వ్యాధులు: క్తికి చెవిలో ఏదైనా రకమైన సమస్య ఉంటే వారికి తక్కువ వినికిడి లేదా మైకము కూడా ఉంటుంది. చెవికి వ్యాపించే ఇన్ఫెక్షన్ కారణంగా నిల్చునప్పుడు నొప్పి లేదా తల తిరగడం వంటి సమస్య ఉంటుంది.. చెవికి సంబంధించిన వ్యాధులకు వెంటనే చికిత్స చేయించుకోవాలి.

ఎక్కువ సేపు కూర్చోవడం: కొందరు ఒకే చోట గంటల తరబడి కూర్చుని పని పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మెదడుపైనా, కళ్లపైనా అదనపు భారం పడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీంతో మైకం సమస్య వేధిస్తుంది.





























