Basha Shek |
Updated on: Apr 25, 2022 | 10:11 AM
కేజీఎఫ్ సిరీస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్- లిఖిత, హీరో యష్-రాధిక పండిట్, భువన్ గౌడ, విజయ్ కిర్గందూర్ తదితరులు వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్నారు.
కేజీఎఫ్ ఛాప్టర్ 2 కోసం చాలా ఏళ్ల పాటు షూటింగ్ సెట్లోనే గడిపారు. ప్రస్తుతం సినిమా విడుదలై ఘన కేజీఎఫ్ ఛాప్టర్ 2 కోసం చాలా ఏళ్ల పాటు షూటింగ్ సెట్లోనే గడిపింది చిత్రబృందం. ప్రస్తుతం సినిమా విడుదలై ఘన విజయం సాధించడం, తీరిక దొరకడంతో అందరూ వెకేషన్‌కు వెళ్లారు.
ఏప్రిల్ 14న విడుదలైన కేజీఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్‌తో దూసుకెళుతోంది. రిలీజై రెండు వారాలైనా ప్రేక్షకులు ఎగబడీ మరీ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు.
సినిమా షూటింగ్‌ల కారణంగా తన కుటుంబ సభ్యులతో గడిపే సమయమే దొరకలేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అయితే ఇప్పుడు కాస్త విరామం లభించడంతో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు.
హీరో యశ్, అతని సతీమణి రాధికా పండిట్ తాజాగ గోవా విమానశ్రయంలో కనిపించారు. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం కేజీఎఫ్ చిత్రబృందం గోవా అందాలను అస్వాదిస్తోంది.