Heat Stroke: హీట్‌స్ట్రోక్‌ నివారించడానికి ఆయుర్వేద మార్గాలు ఇవే..!

Heat Stroke: వేసవిలో పనుల కోసం బయటికి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పెరిగిన ఎండలకి హీట్ స్ట్రోక్‌కి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

Heat Stroke: హీట్‌స్ట్రోక్‌ నివారించడానికి ఆయుర్వేద మార్గాలు ఇవే..!
Heat Stroke
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Apr 25, 2022 | 7:30 AM

Heat Stroke: వేసవిలో పనుల కోసం బయటికి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పెరిగిన ఎండలకి హీట్ స్ట్రోక్‌కి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆయుర్వేదం ప్రకారం బలమైన రోగనిరోధక శక్తి కలిగినవారు వీటిని తట్టుకోగలరు. అందుకోసం మంచి పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకోవాలి. శరీరంపై వేడి గాలి ప్రభావం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ పరిస్థితిలో వికారం, వాంతులు, తల తిరగడం సమస్యలు ఏర్పడుతాయి. హీట్ స్ట్రోక్‌ను నివారించడానికి అల్లోపతి మాదిరిగానే ఆయుర్వేదంలో కూడా కొన్ని నివారణలు ఉన్నాయి. ఈ చర్యలను అనుసరించడం ద్వారా వేసవిలో ఆరోగ్యంగా ఉండగలరు. అటువంటి కొన్ని ఆయుర్వేద నివారణల గురించి తెలుసుకుందాం. అవి హీట్‌స్ట్రోక్ నుంచి రక్షించడంలో సహాయపడుతాయి.

చల్లని ఆహారాలు

వేసవిలో శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం.. ఈ సమయంలో చల్లని ప్రభావం కలిగిన ఆహారాలు తీసుకోవడం మేలు. దోసకాయ, పుచ్చకాయ తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. మీరు వీటిని ఒక రోజు మాత్రమే కాకుండా వేసవిలో అన్ని రోజులు తీసుకుంటూ ఉండాలి.

బేల్‌ సిరప్

ఆయుర్వేదంలో బేల్స్ సిరప్ వినియోగం హీట్‌స్ట్రోక్‌ను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో దీనిని అమృతంలా భావిస్తారు. విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. మలబద్ధకం సమస్య ఉండదు. దీనిని బేల్‌ ఆకులతో తయారుచేస్తారు.

తిప్పతీగ

కరోనా కాలంలో ప్రజలు తిప్పతీగని ఎక్కువగా తిన్నారు. ఇది హీట్ స్ట్రోక్‌ను నివారించడంలో కూడా సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది శరీరంలో తెల్ల రక్త కణాల ఏర్పాటులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలోని మూడు దోషాలు, వాత, పిత్త, కఫాన్ని తొలగిస్తుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకి గమనిక.. ఇవి చేయకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు..!

IPL 2022: విరాట్‌ కోహ్లీ నాలుగు లేదా ఐదో నెంబర్‌లో బ్యాటింగ్‌ చేయాలి.. భారత మాజీ ఆటగాడి సలహా..!

IPL 2022: ఒక్క మ్యాచ్‌ ఆడి ‘సూపర్ మ్యాన్’ అయ్యాడు.. ఎవరో తెలుసా..?

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.