AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకి గమనిక.. ఇవి చేయకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు..!

EPFO: ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా అప్‌డేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అది వ్యక్తిగత సమాచారం అయినా లేదా నామినీ పేరు అయినా ఎప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండాలి.

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకి గమనిక.. ఇవి చేయకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు..!
Epfo
uppula Raju
|

Updated on: Apr 24, 2022 | 7:22 PM

Share

EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా అప్‌డేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వ్యక్తిగత సమాచారం అయినా నామినీ పేరు అయినా అప్‌డేటేడ్‌గా ఉండాలి. మొబైల్ నంబర్ లేదా ఈ మెయిల్ ఐడిలో ఏదైనా మార్పు ఉంటే వెంటనే చేయాలి. ఒకవేళ చేయకపోతే భవిష్యత్‌లో ఇబ్బందిపడాల్సి వస్తోంది. నామినీ పేరు నమోదు చేయకున్నా అంతే సంగతులు. ఇక KYC అప్‌డేట్ లేకపోతే లావాదేవీలు ఆగిపోతాయి. KYC అప్‌డేట్ అయినప్పుడు మాత్రమే ఆన్‌లైన్‌లో EPF నుంచి డబ్బును విత్‌డ్రా చేయగలరు. KYC అప్‌డేట్‌ లేకపోతే ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి డబ్బుల బదిలీ జరగదు. మీరు KYCని అప్‌డేట్ చేస్తే EPF నుంచి నెలవారీ PF సమాచారాన్ని పొందుతారు. అందులో మీ ఖాతాలో ఎంత డబ్బు జమ అయింది. పూర్తి బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుస్తుంది. ముఖ్యంగా 5 ఏళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత పాన్ కార్డ్ సమాచారాన్ని అప్‌డేట్ చేస్తే 10 శాతం టీడీఎస్ కట్ అవుతుంది. పాన్ అప్‌డేట్ చేయకపోతే TDS మొత్తం 30 శాతానికి మించి ఉంటుంది. EPF ఖాతాలో KYCని ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకుందాం.

ఇలా KYCని అప్‌డేట్ చేయండి

1. ముందుగా వెబ్ సైట్ కి వెళ్లి UAN, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయడం ద్వారా లాగిన్ కావాలి.

2. ‘మేనేజ్’ విభాగానికి వెళ్లి, ‘KYC’పై క్లిక్ చేయాలి.

3. పాన్, ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, ఓటింగ్ కార్డ్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ మొదలైన వాటి గురించిన సమాచారాన్ని నింపాల్సిన ఫారమ్ మీ ముందు ఓపెన్ అవుతుంది.

4. ఫారమ్‌తో పాటు మీరు ఇవ్వాలనుకుంటున్న డాక్యుమెంట్ పేరు టిక్ చేసి దాని నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. పేరు, చిరునామాతో పాటు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో బ్యాంక్, గడువు తేదీకి IFSC కోడ్ నింపాలి.

5. ఈ సమాచారాన్ని అందించిన తర్వాత ‘సేవ్’ బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీ పూర్తి సమాచారం ‘పెండింగ్ KYC’లో సేవ్ అవుతుంది.

6. మీరు ఇచ్చిన ఈ సమాచారం EPFOకి వెళ్లి అక్కడ నుంచి వెరిఫికేషన్ అవుతుంది.

7. ధృవీకరణ పూర్తయిన వెంటనే చెక్ మార్క్ కనిపిస్తుంది. KYC అప్‌డేట్‌ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

IPL 2022: విరాట్‌ కోహ్లీ నాలుగు లేదా ఐదో నెంబర్‌లో బ్యాటింగ్‌ చేయాలి.. భారత మాజీ ఆటగాడి సలహా..!

IPL 2022: ఒక్క మ్యాచ్‌ ఆడి ‘సూపర్ మ్యాన్’ అయ్యాడు.. ఎవరో తెలుసా..?

Yamaha Fascino125: సరికొత్త రంగులో ఫాసినో 125 స్కూటర్.. సుజుకి యాక్సెస్ టీవీఎస్‌ జూపిటర్‌కి గట్టి పోటీ..!