EPFO: మీ పీఎఫ్‌ అకౌంట్‌లో ఉన్న డబ్బును మరొకదానికి బదిలీ చేయాలనుకుంటున్నారా..? సింపుల్‌ ఇలా చేయండి..!

PF Account Balance: ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) తన ఖాతాదారుల కోసం అనేక చర్యలు చేపడుతూ ఉంటుంది. నిబంధనలు మారుస్తూ ఖాతాదారులకు..

EPFO: మీ పీఎఫ్‌ అకౌంట్‌లో ఉన్న డబ్బును మరొకదానికి బదిలీ చేయాలనుకుంటున్నారా..? సింపుల్‌ ఇలా చేయండి..!
Follow us
Subhash Goud

|

Updated on: Apr 24, 2022 | 7:22 PM

PF Account Balance: ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) తన ఖాతాదారుల కోసం అనేక చర్యలు చేపడుతూ ఉంటుంది. నిబంధనలు మారుస్తూ ఖాతాదారులకు సులభమైన పద్దతులను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. EPFO చాలా సేవలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. గతంలో ఏదైనా పనుల నిమిత్తం పీఎఫ్‌ కార్యాలయానికి వెళ్లి చేసుకోవాల్సి వచ్చేది. కానీ టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా ఖాతాదారుడు ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో పీఎఫ్‌కు సంబంధించిన సేవలు పొందవచ్చు. అయితే మీ డబ్బును ఒక పీఎఫ్‌ అకౌంట్‌ నుంచి మరొకదానికి బదిలీ చేయాలనుకుంటే సులభమైన మార్గాల ద్వారా ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. అయితే దాని కోసం మీరు ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేకుండా.. ఇంట్లో ఉండిమీ EPFని బదిలీ చేసుకోవచ్చు. మీరు పీఎఫ్‌ నుండి డబ్బును బదిలీ చేయాలనుకుంటే, ముందుగా మీరు UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) యాక్టివేట్‌ అయి ఉండాలి.

☛ ముందుగా యునైటెడ్ మెంబర్ పోర్టల్’ని సందర్శించి మీ UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.

☛ అందులో Online Service’’కి వెళ్లండి.

☛ One Member- One EPF Account (బదిలీ అభ్యర్థన)పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

☛ ప్రస్తుత ఉద్యోగానికి సంబంధించి, వ్యక్తిగత సమాచారం, పీఎఫ్‌ అకౌంట్‌ను ధృవీకరించండి.

☛ తర్వాత Get Details పై క్లిక్ చేయండి. తర్వాత మీరు గతంలో పని చేసిన కంపెనీ PF ఖాతా వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

☛ ఫారమ్ వెరిఫికేషన్ కోసం మునుపటి లేదా ప్రస్తుత యజమానిని ఎంచుకోవాల్సి ఉంటుంది.

☛ UAN నమోదిత మొబైల్ నంబర్‌ ద్వారా OTPని స్వీకరించడానికి Get OTP ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

☛ తర్వాత వచ్చిన OTPని నమోదు చేసి సబ్మిమ్ క్లిక్ చేయండి.

దీంతో ఆన్‌లైన్ డబ్బు బదిలీ ప్రక్రియ అభ్యర్థన పూర్తి అవుతుంది. మూడు రోజుల్లో బదిలీ ప్రక్రియ జరుగుతుంది. ముందుగా కంపెనీ డబ్బును బదిలీ చేస్తుంది. తర్వాత EPFO ​ఫీల్డ్ ఆఫీసర్ దానిని వెరిఫై చేసి ధృవీకరణ తర్వాత మీ డబ్బు బదిలీ చేయబడుతుంది. బదిలీ అభ్యర్థన పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి మీరు క్లెయిమ్ స్థితిని ట్రాక్ చేయడం ద్వారా స్టెటస్ చెక్ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

PAN Card Uses: పాన్‌ కార్డు ఉపయోగం ఏమిటి..? ఏయే వాటికి అవసరం.. పూర్తి వివరాలు

May 2022 Bank Holidays: మే నెలలో 13 రోజులు బ్యాంకులకు సెలవులు.. ఏయే రోజు అంటే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!