4 బంతుల్లో 3 వికెట్లు.. 5గురు బ్యాటర్లు సింగిల్ డిజిట్లు.. ప్రత్యర్ధులపై వీరవిహారం.. ఆ బౌలర్ ఎవరో తెలుసా?
డొమెస్టిక్ క్రికెట్‌లో ఎంతోమంది ఆటగాళ్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా టెస్టుల్లో అద్భుతంగా రాణించి..
డొమెస్టిక్ క్రికెట్‌లో ఎంతోమంది ఆటగాళ్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా టెస్టుల్లో అద్భుతంగా రాణించి.. జాతీయ జట్టులో చోటు సంపాదిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ దక్షిణాఫ్రికా బౌలర్ ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌లో సత్తా చాటాడు. తన పదునైన బంతులతో ప్రత్యర్ధులను ముప్పుతిప్పలు పెట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ బౌలర్.. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో హాంప్‌షైర్ వెర్సస్ కెంట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లతో అదరగొట్టాడు. ఇక అతడెవరో కాదు కైల్ అబాట్.
ఈ మ్యాచ్‌లో హాంప్‌షైర్.. కెంట్‌పై ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇందులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కెంట్ తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా హాంప్‌షైర్ తన తొలి ఇన్నింగ్స్‌ను 6 వికెట్లకు 652 పరుగులు దగ్గర డిక్లేర్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లు జేమ్స్ విన్స్(111), డాసన్(171), బెన్ బ్రౌన్(157) సెంచరీలు చేశారు. దీనితో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కెంట్.. కైలీ అబాట్ ధాటికి 296 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంకేముంది హాంప్‌షైర్ ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.
కెంట్ టాప్ ఆర్డర్‌ను కైలీ అబాట్ గట్టిగా దెబ్బ తీశాడు. జాక్ క్రాలీ(29), ద్రమ్మొండ్(0)లను తక్కువ పరుగులకే పెవిలియన్ చేర్చిన ఈ 34 ఏళ్ల బౌలర్.. లోయర్ ఆర్డర్‌ను కూడా వెనువెంటనే డగౌట్‌కు చేర్చాడు. అంతేకాదు 4 బంతుల్లో 3 వికెట్లు పడగొట్టి ఇన్నింగ్స్‌ను త్వరగా పూర్తి చేశాడు. కెంట్ బ్యాటర్లలో 5గురు సింగిల్ డిజిట్లకే పెవిలియన్ చేరడం గమనార్హం. కాగా, ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో హాంప్‌షైర్‌కు ఇది రెండో విజయం కాగా, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.
??? ??????? ?????? ?@Kyle_Abbott87 takes THREE wickets in the first over after tea and we seal victory by an innings and 51 runs ???
Match Centre ▶️ https://t.co/nhKDafMdWf pic.twitter.com/LRbN11jxgt
— Hampshire Cricket (@hantscricket) April 24, 2022