AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: సేతుపతి, సామ్‌ల పాటకు చిందులేసిన చెన్నై ఆటగాళ్లు.. స్పెషల్‌ అట్రాక్షన్‌గా ధోని డ్యాన్స్‌..

Chennai Super Kings: న్యూజిలాండ్ స్టార్‌ ఆటగాడు డేవిడ్‌ కాన్వే (Devon Conway) ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Superkings)కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే

IPL 2022: సేతుపతి, సామ్‌ల పాటకు చిందులేసిన చెన్నై ఆటగాళ్లు.. స్పెషల్‌ అట్రాక్షన్‌గా ధోని డ్యాన్స్‌..
Chennai Super Kings
Basha Shek
|

Updated on: Apr 25, 2022 | 8:34 AM

Share

Chennai Super Kings: న్యూజిలాండ్ స్టార్‌ ఆటగాడు డేవిడ్‌ కాన్వే (Devon Conway) ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Superkings)కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా త్వరలోనే తన ప్రియురాలితో కలిసి పెళ్లిపీటలెక్కనున్నాడీ చెన్నై ప్లేయర్‌. ఈ సందర్భంగా ఇటీవల తనకు కాబోయే సతీమణితో కలిసి ప్రీ వెడ్డింగ్ వేడుకలను ఘనంగా జరుపుకొన్నాడు. సీఎస్కే టీం సభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. కెప్టెన్‌ రవీంద్ర జడేజా, మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని, మిచెల్ సాంట్నర్, రుతురాజ్‌ గైక్వాడ్‌, డ్వేన్‌ బ్రావో, మొయిన్ అలీ, శివమ్ దూబే తదితర ఆటగాళ్లు ఈ పార్టీకి హాజరై కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కేట్‌ కూడా కట్‌ చేసి కాన్వే ముఖంపై పూశారు. అనంతరం సినిమా పాటలకు సరదాగా డ్యాన్స్‌ చేశారు. కాగా ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌ గా మారాయి. ముఖ్యంగా విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi), సామ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన కాతు వక్కుల రెండు కాదల్ సినిమాలోని ‘టు టు టు’ అనే పార్టీ సాంగ్‌కు సీఎస్కే టీం సభ్యులు డ్యాన్స్ చేసిన వీడియో ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది.

సమంత విషెస్‌..

డెవాన్ కాన్వేతో పాటు ఆటగాళ్లంతా లుంగీలో ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. రుతురాజ్ గైక్వాడ్, డ్వేన్ బ్రావో అందరికంటే ఉత్సాహంగా కాలు కదిపారు. మాజీ కెప్టెన్‌ ధోనీ కూడా భుజాలెగరెస్తూ కనిపించాడు. ఈ వీడియోను సీఎస్‌కే టీం తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేసింది. దీనికి విసిల్‌ పోడు అనే హ్యాష్‌ ట్యాగ్‌ ఇచ్చింది. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. ప్రముఖ టాలీవుడ్ నటి సమంత కూడా ఈ వీడియోను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేసింది. జడేజా టీంకు ఆల్‌ది బెస్ట్ చెప్పింది. కాగా రొమాంటిక్‌ ఎంటర్‌టైన్‌ర్‌గా తెరకెక్కిన కాతు వక్కుల రెండు కాదల్ సినిమాలో సేతుపతి సరసన సమంత, నయనతార హీరోయిన్లుగా నటించారు. తెలుగులో కణ్మణి రాంబో ఖతీజా డబ్‌ చేస్తున్నారు. ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

Also Read: Postpaid Plans: జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాల నుంచి అద్భుతమైన ప్లాన్‌.. ఒకే ధర.. బెనిఫిట్స్‌ వేరు..!

Andhra Pradesh: చింతూరులో రెచ్చిపోయిన మావోయిస్టులు.. హైవేపై అర్ధరాత్రి బస్సు దగ్ధం

Tiruapati: శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. అమ్మవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన