Hasan Ali:150 కి.మీ. స్పీడ్‌తో బుల్లెట్ లాంటి యార్కర్.. దెబ్బకు మిడిల్ స్టంప్ ఎలా ముక్కలైందో మీరే చూడండి..
హసన్ అలీ.. పదునైన బంతులతో ప్రత్యర్థులను వణికించే ఈ పాకిస్తాన్ బౌలర్ గతేడాది టీ 20 ప్రపంచకప్‌లో అందరినోళ్లల్లో నానాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కీలకమైన మాథ్యూవేడ్ క్యాచ్‌ను..
హసన్ అలీ.. పదునైన బంతులతో ప్రత్యర్థులను వణికించే ఈ పాకిస్తాన్ బౌలర్ గతేడాది టీ 20 ప్రపంచకప్‌లో అందరినోళ్లల్లో నానాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కీలకమైన మాథ్యూవేడ్ క్యాచ్‌ను వదిలిపెట్టడమే అందుకు కారణం. ఈ సందర్భంగా పాక్ క్రికెట్ ఫ్యాన్స్ కొందరు అతనిని, అతనిని కుటుంబ సభ్యులను దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అప్పటి నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉన్న హసన్ అలీ (Hasan Ali) ప్రస్తుతం కౌంటీ క్రికెట్‌లో బిజీగా గడుపుతున్నాడు. లంకాషైర్ (Lancashire)కు ప్రాతినిథ్యం వహిస్తూ సత్తా చాటుతున్నాడు. తాజాగా గ్లౌసెష్టర్‌షైర్ (Gloucestershire) తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇందులో భాగంగా గ్లౌసెష్టర్‌షైర్ బ్యాటర్ జేమ్స్ బ్రేసీని క్లీన్‌బౌల్డ్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. దాదాపు 150 కిమీ వేగంతో అలీ విసిరిన పదునైన యార్కర్ జేమ్స్ కాళ్ల సందుల నుంచి వెళ్లి మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది. బంతి మరీ వేగంగా రావడంతో స్టంప్ రెండు ముక్కలయింది. దీనికి సంబంధించిన వీడియోను లంకాషైర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘కొత్త స్టంప్ ప్లీజ్.. చెప్పడానికి ఏం లేదు.. మేం ఇంకో స్టంప్ తెప్పించాల్సిందే’ అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
కాగా హసన్ అలీ అద్భుత ప్రదర్శనతో గ్లౌసెష్టర్ షైర్‌పై ఇన్నింగ్స్ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది లంకాషైర్. మొదట బ్యాటింగ్ చేసిన గ్లౌసెష్టర్ షైర్ లంకాషైర్ బౌలర్ల ధాటికి 252 పరుగులకు కుప్పకూలింది. హసన్ అలీ ఆరువికెట్లతో మెరిశాడు. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంకాషైర్ 556 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తద్వారా 304 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో గ్లౌసెష్టర్ షైర్ 247 పరుగులకు ఆలౌటైంది. హసన్ అలీ మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు కెంట్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 5 వికెట్లతో సత్తాచాటాడు అలీ.
NEW STUMPS, PLEASE! ?@RealHa55an ?
? #RedRoseTogether pic.twitter.com/KhjUz3TG6q
— Lancashire Cricket (@lancscricket) April 23, 2022
“Oh my word!” ?
We’ll have to get another one of those, @RealHa55an! ?
? #RedRoseTogether pic.twitter.com/XQO4reizR1
— Lancashire Cricket (@lancscricket) April 23, 2022
Also Read:
Migraine: ఈ కారణాల వల్ల మైగ్రేన్ వేధిస్తుంది.. అవేంటో తెలుసుకోండి..
Lakhimpur Kheri Case: లఖింపూర్ ఖేరీ కేసు.. ఒకరోజు ముందే కోర్టులో లొంగిపోయిన ఆశిష్ మిశ్రా