British Woman: 99 ఏళ్ల వయసులో యుద్ద విమానం నడిపిన మహిళ.. ఆమె ఆత్మవిశ్వాసానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే..!
British Woman: సాధారణంగా వృద్ధాప్యంలో ప్రజలు చాల బలహీనంగా ఉంటారు. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. సరిగ్గా నడవలేరు. వారి సొంత పనులు
British Woman: సాధారణంగా వృద్ధాప్యంలో ప్రజలు చాల బలహీనంగా ఉంటారు. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. సరిగ్గా నడవలేరు. వారి సొంత పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఇంకొంత మంది సొంత కుటుంబ సభ్యులనే మరచిపోతారు. కానీ ఒక బ్రిటీష్ మహిళ వీటన్నింటిని అధిగమించి 99 ఏళ్ల వయసులో యుద్ధ విమానాన్ని నడిపి అందరిని ఆశ్చర్యపరిచింది. తనలాంటి ఎందరికో స్పూర్తినిచ్చింది. 99 ఏళ్ల వయసులో విమానం నడపడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయం తెలిసిన చాలామంది షాక్ అవుతున్నారు. ఆ మహిళ పేరు కేట్ ఆర్చర్డ్. ఆమె కార్న్‌వాల్‌లో నివసిస్తోంది. మీడియా నివేదికల ప్రకారం.. కేట్ గతంలో బ్రిటిష్ రాయల్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేశారు. ఆమె పైలట్‌గా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంది. కానీ ఇప్పుడు ఆమె వయస్సు 99 సంవత్సరాలు. ఈ వయసులో యుద్ధ విమానం నడపడం నిజంగా చాలా కష్టం. కానీ ఆమె చాలా సులువుగా చేసి చూపించింది.
కేట్ విమానాన్ని సులభంగా టేకాఫ్ చేయడమే కాకుండా అంతే సులభంగా ల్యాండ్ కూడా చేసింది. ఈ అద్భుత దృశ్యాన్ని ఆయన కుటుంబ సభ్యులు దగ్గరుండి వీక్షించారు. ఆమె విమానం నడిపిన వీడియోని BBC రేడియో కార్న్‌వాల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేట్‌కు మరికొన్ని రోజుల్లో 100 ఏళ్లు వస్తాయని క్యాప్షన్ పేర్కొంది. విమానంలో ప్రయాణించడం ద్వారా తన పాత రోజులను గుర్తుచేసుకున్నట్లు కేట్ చెప్పారు. అంతేకాదు విమానం నడపడం అనేది తనకి పెద్ద కష్టమేమి కాదని పేర్కొంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి