Weight Loss: అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా..? బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఐదు ఫుడ్‌లను ట్రై చేయండి..

Breakfast for Weight Loss: ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బరువు తగ్గడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన మార్గం డైటింగ్.

Weight Loss: అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా..? బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఐదు ఫుడ్‌లను ట్రై చేయండి..
Weight Loss
Shaik Madarsaheb

|

Apr 26, 2022 | 9:30 AM

Breakfast for Weight Loss: ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బరువు తగ్గడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన మార్గం డైటింగ్. ఆహారాన్ని నియంత్రించడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా బరువు సులభంగా తగ్గించవచ్చు. అయితే స్థూలకాయాన్ని తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి. తక్కువ కేలరీలు, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఆహారంలో చేర్చాలి. చాలా మంది డైటింగ్ ప్రక్రియలో పూర్తిగా రుచిలేని ఆహారాన్ని తింటారు. వాస్తవానికి ఇది చాలా కాలం పాటు తినలేరు. డైటింగ్ సమయంలో కొంతమందికి అల్పాహారం ఎంపికలను అర్థం కావు. అటువంటి పరిస్థితిలో ఇలాంటగి 5 ఆరోగ్యకరమైన అల్పాహార ఎంపికలు మంచివని నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి రుచిగా ఉండటంతోపాటు బరువు పెరగకుండా చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉప్మా- మీరు డైట్‌లో ఉంటే బొంబాయి రవ్వతో చేసిన ఉప్మా తినవచ్చు. ఇది ఆరోగ్యకరమైన అల్పాహారం ఎంపిక. ఉప్మాలో మీకు నచ్చిన కూరగాయలను ఎక్కువగా చేర్చుకోవచ్చు. దీంతో శరీరానికి పీచు పుష్కలంగా అందుతుంది. ఉప్మా కూడా సులువుగా జీర్ణం అవుతుంది. తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలి వేయదు.

పోహా- అల్పాహారానికి పోహా మంచి ఎంపిక. అందరూ పోహా తినడానికి ఇష్టపడతారు. పోహా చాలా తేలికగా ఉంటుంది. ఇది జీర్ణం చేయడం కూడా సులభం. పోహాలో కూరగాయల పరిమాణాన్ని కూడా పెంచుకోవచ్చు. ఒక ప్లేట్ పోహ, దానితో పాటు మజ్జిగ తాగడం వల్ల ఇది చాలా కాలం పాటు ఉత్సాహంగా ఉంచుతుంది. దాంతో బరువు కూడా పెరగదు.

ఓట్స్- అల్పాహారం చేయడానికి సమయం లేకపోతే.. నిమిషాల్లో ఓట్స్ తయారు చేసుకోని తినవచ్చు. ఫైబర్ పుష్కలంగా, సూపర్ హెల్తీగా ఉండే అల్పాహారం ఇది. ఓట్స్ తినడానికి చాలా రుచిగా ఉంటాయి. ఓట్స్ తింటే ఎక్కువ సేపు ఆకలిగా అనిపించదు. ఉదరం, గుండె, మధుమేహ రోగులకు కూడా ఓట్స్ చాలా మేలు చేస్తుంది.

ఓట్ మీల్- బరువు తగ్గడానికి, మీరు అల్పాహారంలో తప్పనిసరిగా ఓట్ మీల్‌ను చేర్చుకోవాలి. ఓట్ మీల్ ఎంత ఫిట్‌నెస్ ఫుడ్ అంటే.. ఇది తింటే చాలా సేపు పొట్ట నిండుగా ఉంటుంది. ఓట్‌మీల్‌లో బాగా ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు సమస్యలను తొలగిస్తుంది.

కార్న్‌ఫ్లేక్స్- మీరు తక్కువ సమయంలో ఆరోగ్యకరమైన అల్పాహారం తినాలనుకుంటే.. మీరు వెంటనే మిల్క్ కార్న్‌ఫ్లేక్స్ చేసుకోని తినవచ్చు. కార్న్‌ఫ్లేక్స్‌ కరకరలాడటంతోపాటు రుచి మంచిగా ఉంటుంది. అందుకే ఈ ఫుడ్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా ఇష్టం. కార్న్‌ఫ్లేక్స్‌లో థయామిన్ ఉంటుంది ఇది జీవక్రియ రేటు, శక్తిని పెంచుతుంది. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల బరువు కూడా తగ్గుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

Also Read:

Diabetes: డయాబెటిస్‌తో బాధపడుతున్నారా..? ఈ ఆయుర్వేద చిట్కాలతో సింపుల్‌గా కంట్రోల్ చేసుకోవచ్చు..

Health Tips: బ్లడ్ షుగర్ అదుపులో ఉండాలంటే.. ప్రతిరోజు ఉదయం ఈ వాటర్ తప్పక తాగాల్సిందే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu