AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: డయాబెటిస్‌తో బాధపడుతున్నారా..? ఈ ఆయుర్వేద చిట్కాలతో సింపుల్‌గా కంట్రోల్ చేసుకోవచ్చు..

Ayurvedic Treatment For Diabetes: ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. మధుమేహం శరీరంలో అనేక రకాల వ్యాధులకు

Diabetes: డయాబెటిస్‌తో బాధపడుతున్నారా..? ఈ ఆయుర్వేద చిట్కాలతో సింపుల్‌గా కంట్రోల్ చేసుకోవచ్చు..
Diabetes
Shaik Madar Saheb
|

Updated on: Apr 26, 2022 | 8:27 AM

Share

Ayurvedic Treatment For Diabetes: ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. మధుమేహం శరీరంలో అనేక రకాల వ్యాధులకు కారణమయ్యే వ్యాధి. మధుమేహం మన శరీరంలోని ఇతర భాగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో డయాబెటిక్ బాధితులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి ఆహారం, జీవనశైలి ద్వారా మధుమేహాన్ని చాలా వరకు నియంత్రించవచ్చు. అంతే కాకుండా ఆయుర్వేదంలో మధుమేహాన్ని నియంత్రించే అనేక అంశాలు ఉన్నాయి. మధుమేహాన్ని నియంత్రించడానికి ఇంటి.. ఆయుర్వేద చిట్కాలు బాగా పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మధుమేహం నివారణకు ఆయుర్వేద చిట్కాలు..

  1. మెంతులు- మెంతికూర: మధుమేహాన్ని నియంత్రించడానికి మెంతులు, మెంతికూర ఔషధంలా పనిచేస్తాయి. మెంతులు తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. దీని కోసం, 1 టీస్పూన్ మెంతి గింజలను 1 గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం పరగడుపుతో ఈ నీటిని తాగుతూ మెంతిగింజలను తినాలి. ఈ రెమెడీ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.
  2. దాల్చిన చెక్క: దాల్చిన చెక్కను మసాలాగా ఉపయోగిస్తారు. దాల్చిన చెక్క తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దాల్చిన చెక్క తినడం వల్ల మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. వాస్తవానికి ఇందులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం రోజూ అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని నీటిలో వేసుకోని తాగడం మంచిది.
  3. అంజీర్ ఆకులు: మధుమేహాన్ని నియంత్రించడానికి అంజీర్ ఆకులను ఉపయోగిస్తారు. అంజీర్ ఆకులలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి. ఉదయం పరగడుపుతో అంజీర్ ఆకులను నమలి తినవచ్చు లేదా నీటిలో మరిగించి తాగవచ్చు. దీంతో మధుమేహం అదుపులో ఉంటుంది.
  4. నేరేడు గింజలు: జామున్ గింజల పొడి మధుమేహానికి దివ్యౌషధంగా పరిగణిస్తారు. ఇందుకోసం జామూన్ గింజలను బాగా ఎండబెట్టిన తర్వాత మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఈ పొడిని ఉదయం గోరువెచ్చని నీటిలో వేసుకొని పరగడుపున తీసుకోవాలి. ఇదేకాకుండా నేరేడు పండ్లను తినడం ద్వారా చక్కెర స్థాయి పెరగకుండా నియంత్రణలో ఉంచుకోవచ్చు.
  5. ఉసిరి: విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరి మధుమేహానికి చాలా మేలు చేస్తుంది. ఉసిరికాయ హైపోగ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఉసిరికాయ తింటే కేవలం అరగంటలో రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. ఉసరి పొడిని నీటిలో వేసుకోని వేడి చేసుకొని చేసి వాడాలి. ఇది క్రమంగా చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

Also Read:

Detox Drinks: జీలకర్ర, కొత్తిమీర, సోంపు వాటర్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలుసుకుంటే అస్సలు వదిలిపెట్టరు..

Home Remedies: మీ పిల్లలకి పళ్ళు వస్తున్నాయా.. ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి..