Home Remedies: మీ పిల్లలకి పళ్ళు వస్తున్నాయా.. ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి..

పుట్టిన 9 నెలల తర్వాత శిశువులకు దంతాలు(Teething in Babies) రావడం సర్వసాధారణం. ఈ సమయంలో పిల్లలు అనేక సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభిస్తారు. ఈ సమస్యలలో వాంతులు..

Home Remedies: మీ పిల్లలకి పళ్ళు వస్తున్నాయా.. ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి..
Teething In Babies
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 26, 2022 | 7:43 AM

పుట్టిన 9 నెలల తర్వాత శిశువులకు దంతాలు(Teething in Babies) రావడం సర్వసాధారణం. ఈ సమయంలో పిల్లలు అనేక సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభిస్తారు. ఈ సమస్యలలో వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యతో బాధపడుతున్న పిల్లలు చాలా నీరసంగా, డిప్రెషన్‌కు గురవుతారు. మన పిల్లలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురవుతారు. తమ చిన్నారికి విరేచనాలు ఎందుకు అవుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. తల్లిదండ్రులు ఇలా అందోళనకు గురికావడం వల్ల చిన్నారులు మరింత నీరసంగా మారిపోతారు. ముందుగా మీరు మీ పిల్లల బద్ధకం, విచారాన్ని తొలగించాలనుకుంటే దీని కోసం కొన్ని ఇంటి చిట్కాలను అనుసరించండి.

  1. పిల్లలకు పళ్లు వచ్చిన తర్వాత వాంతులు, విరేచనాల సమస్య ఉండటం సహజం. ముందుగా ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఉప్పు, పంచదార కలిపిన ద్రావణాన్ని పిల్లలకు ఇవ్వండి. దీనితో మీ బిడ్డ బలహీనంగా అనిపించదు. కొంత ఉత్సాహంగా ఉంటారు.
  2. దంతాల వచ్చే సమయంలో పిల్లలకు చాలా తక్కువ ఆకలితో ఉంటారు. ఈ పరిస్థితిలో ప్రతిసారీ పిల్లలకు పాలు తాగించేందుకు ప్రయత్నించండి. అలాగే కొంచెం.. కొంచెం నీరు కూడా ఇవ్వండి.
  3. పళ్ళు వచ్చే సమయంలో మీరు మీ పిల్లలకు కొద్దిగా ఘనమైన ఆహారాన్ని ఇవ్వవచ్చు. ఈ సమయంలో వారికి అప్పుడప్పుడు సూప్-అరటిపండు, కిచ్డీ వంటివి ఇవ్వండి. దీనితో మీ బిడ్డ శారీరకంగా బలహీనంగా ఉండడు.
  4. సూప్-అరటిపండు: సూప్-అరటిపండు అంటే అరటిపండును మెత్తగా చేసి చిన్న చిన్నగా తినిపించే ప్రయత్నం చేయాలి. వారు తింటేనే ఇవ్వండి.
  5. కిచ్డీ: బియ్యం,పెసర పప్పును నీటిలో నానబెట్టండి. ఓ అరగంట పాటు నానిన తర్వాత వాటిని ఉడికించండి. మెత్తగా ఉడికిన కచ్డీలో కొద్దిగా ఆవు నెయ్యిని జోడించి.. చిన్న చిన్నని గోరుముద్దలను తినిపించండి.
  6. పళ్ళు వచ్చేటపుడు పిల్లలకు తేనె ఇవ్వండి. దీంతో వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తగ్గుతాయి. దీంతో పాటు పంటి నొప్పికి కూడా ఉపశమనం లభిస్తుంది.

దంతాలు వచ్చిన మొదటి కొద్ది రోజులు పిల్లల శరీరం నుంచి చాలా నీరు(లాలాజలం, సొల్లు) బయటకు వస్తుంది. ఈ పరిస్థితిలో పిల్లలను హైడ్రేట్‌గా ఉంచడానికి కొంత ఎక్కువగా నీరు ఇవ్వండి. దీని ద్వారా బిడ్డ నీరసంగా ఉండదు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి: Elon Musk Buy Twitter: ఎలన్‌ మస్క్‌ చేతిలోకి ట్విట్టర్‌ పిట్ట.. 44 బిలియన్‌ డాలర్లకు డీల్‌..