AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: బ్లడ్ షుగర్ అదుపులో ఉండాలంటే.. ప్రతిరోజు ఉదయం ఈ వాటర్ తప్పక తాగాల్సిందే..

బెండకాయ వాటర్ మన శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని మీకు తెలుసా? శరీరంలో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసేందుకు ఈ వాటర్ పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Health Tips: బ్లడ్ షుగర్ అదుపులో ఉండాలంటే.. ప్రతిరోజు ఉదయం ఈ వాటర్ తప్పక తాగాల్సిందే..
Lady Finger Water
Venkata Chari
|

Updated on: Apr 26, 2022 | 8:45 AM

Share

ప్రస్తుతం వేసవి కాలం(Summer) కొనసాగుతోంది. ఈ సీజన్‌లో పుష్కలంగా నీరు(Water), శరీరానికి అవసరమైన పోషకాలను కలిగి ఉన్న వాటిని తినడానికి ఇష్టపడతారు. వేసవి కాలంలో అధికంగా కనిపించే వాటిలో బెండకాయ(Lady Finger) కూడా ఒకటి. లేడీస్ ఫింగర్‌లో ఎన్నో ప్రయోజనకరమైన అంశాలు ఉన్నాయి. ఓక్రా వాటర్ మన శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని మీకు తెలుసా? శరీరంలో బ్లడ్ షుగర్ నిర్వహణకు బెండకాయ నీళ్లు చక్కగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బెండకాయలో శరీరానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో ఫైబర్, విటమిన్-బి6, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్-బి డయాబెటిక్ న్యూరోపతి పురోగతిని నిరోధిస్తుంది. శరీరంలో మధుమేహానికి ప్రధాన కారణమని భావించే హోమోసిస్టీన్ స్థాయిని తగ్గిస్తుంది. అలాగే, నీటిలో కరిగే ఫైబర్ ఓక్రా లోపల ఉంటుంది. ఇది శరీరంలో చక్కెరను స్థిరంగా ఉంచుతుంది.

రక్తంలో చక్కెర ఎలా నియంత్రిస్తుంది?

బెండకాయలో కేలరీలు తక్కువగా ఉండడమే కాకుండా, నీటిలో కరిగే, కరగని ఫైబర్‌కి ఇది చాలా మంచి మూలంగా పేరుగాంచింది. ఈ మూలకం కారణంగా, ఫైబర్ శరీరంలో ఆలస్యంగా విచ్ఛిన్నమవుతుంది. అలాగే రక్తంలో చక్కెర చాలా నెమ్మదిగా విడుదల అవుతుంది. ఓక్రా శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఇదే కారణం.

ఇది కాకుండా, ఓక్రా గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కూడా చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నవి మన రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయని నిరూపితమైంది. ‘అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్’ కూడా డయాబెటిక్ రోగులకు లేడీఫింగర్ చాలా మంచి ఎంపికగా పరిగణించారు.

బెండకాయ నీటిని ఎలా సిద్ధం చేయాలి?

బెండకాయ వాటర్ శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని కోసం, మొదట 5-6 బెండకాయలను తీసుకొని వాటిని బాగా కడగాలి. దీని తరువాత, కత్తి సహాయంతో రెండు పొడవాటి భాగాలుగా కత్తిరించండి. కట్ చేసిన ముక్కలను ఒక పాత్రలో నీళ్లుపోసి రాత్రంతా నానబెట్టాలి. రక్తంలో చక్కెరను నియంత్రించే బెండకాయ నీరు ఇప్పుడు సిద్ధంగా ఉంది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న చిట్కాలు, పద్ధతులు కేవలం సమాచారం కోసమేనని గుర్తుంచుకోవాలి. వీటిని ప్రయత్నించాలనుకుంటే, కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించడం మంచింది.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: World Malaria Day: నేడు మలేరియా దినోత్సవం.. ఈ వ్యాధి లక్షణాలు.. రకాలు.. నివారణ చర్యలు

Child Care: చిన్నారులకు పొరపాటున కూడా ఈ ఆహారాలు తినిపించకూడదు.. చాలా ప్రమాదం..!