Child Care: చిన్నారులకు పొరపాటున కూడా ఈ ఆహారాలు తినిపించకూడదు.. చాలా ప్రమాదం..!

Children Care: సాధారణంగా ప్రతి తల్లిదండ్రులు పిల్లల మానసిక అభివృద్ధికి అవసరమైన అన్ని పనులు చేస్తారు. అయితే పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Child Care: చిన్నారులకు పొరపాటున కూడా ఈ ఆహారాలు తినిపించకూడదు.. చాలా ప్రమాదం..!
Children Care
Follow us

|

Updated on: Apr 25, 2022 | 5:29 PM

Children Care: సాధారణంగా ప్రతి తల్లిదండ్రులు పిల్లల మానసిక అభివృద్ధికి అవసరమైన అన్ని పనులు చేస్తారు. అయితే పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారం, స్నానం, నిద్ర, ఏడుపు కారణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అయినప్పటికీ కొన్నిసార్లు తల్లిదండ్రులు తప్పులు చేస్తారు. వీటివల్ల శిశువుకు హాని కలుగుతుంది. కొంతమంది తల్లులు పసిపిల్లలకి కొన్ని ఆహారాలని తినిపిస్తారు. ఇది వారి ఆరోగ్యానికి మంచిది కాదు. అలాంటి కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం.

కాల్చిన మాంసం

కాల్చిన మాంసం చిన్నపిల్లలకి అస్సలు తినిపించకూడదు. చిన్నపిల్లలే కాదు వృద్ధులు కూడా వీటిని తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు శిశువుకు ఇలాంటి మాంసాన్ని తినిపిస్తారు. ఇది వారి ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు కావాలంటే ఉడికించిన మాంసాన్ని పిల్లలకి తినిపించవచ్చు.

చేపలు, రొయ్యలు

పిల్లలు రొయ్యలు, ఎండ్రకాయలు వంటి సముద్రపు ఆహారాన్ని తినకూడదు. వాస్తవానికి చేపల ఆహారంలో ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయని చెబుతారు. కానీ ఈ రోజుల్లో చేపల్లో పాదరసం ఉన్నట్లు కనుగొన్నారు. కాబట్టి శిశువుకు ఇలాంటి ఆహారం ఇవ్వడం మంచిది కాదు.

వేరుశెనగ వెన్న

ఇందులో ఒలేయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. అయినప్పటికీ ఇది శిశువులకు మంచిది కాదు. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల బిడ్డకు అలర్జీ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా పిల్లలకు వేరుశెనగ వెన్న తినిపించవద్దని సలహా ఇస్తారు.

తీపి పదార్థాలు

తీపి పదార్థాలు, పంచదారతో తయారు చేసిన ఆహారాలని పిల్లలకు ఎక్కువగా తినిపించకూడదు. ప్రస్తుత కాలంలో పసిపిల్లలకి తల్లిదండ్రులు ఎక్కువగా చాక్లెట్లని అలవాటు చేస్తున్నారు. ఈ చాక్లెట్లు అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. కానీ వీటిలో ఉండే రసాయనాలు శిశువుకు అనారోగ్యం కలిగిస్తాయి. తీపి విషయాలు పిల్లల శారీరక అభివృద్ధిపై మాత్రమే కాకుండా మానసిక అభివృద్ధిపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతాయని గుర్తుంచుకోండి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vitamin C: ఈ ఫ్రూట్స్‌లో విటమిన్‌ సి పుష్కలం.. మహిళలు కచ్చితంగా తినాల్సిందే..!

Health Photos: వ్యాధులు దూరంగా ఉండాలంటే ఈ మూలికలు డైట్‌లో ఉండాల్సిందే..!

Realme Narzo 50A Prime: రియల్‌మి నార్జో 50A ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌.. ధర, ఫీచర్ల గురించి తెలుసుకోండి..!