- Telugu News Photo Gallery Health tips ayurvedic herbs to keep diseases away add these ayurvedic herbs in your diet
Health Photos: వ్యాధులు దూరంగా ఉండాలంటే ఈ మూలికలు డైట్‌లో ఉండాల్సిందే..!
Health Photos: ఆయుర్వేద మూలికలు అనేక వ్యాధులను నయం చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తినవచ్చు. అలాంటి మూలికల గురించి కొన్ని
Updated on: Apr 25, 2022 | 4:37 PM

ఆయుర్వేద మూలికలు అనేక వ్యాధులను నయం చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తినవచ్చు. అలాంటి మూలికల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

అశ్వగంధ: అశ్వగంధ ఆయుర్వేదంలో కింగ్. ఇది ఒత్తిడి, ఆందోళన స్థాయిని తగ్గిస్తుంది. ఇది మెదడు పని సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. అర టీస్పూన్ అశ్వగంధ పొడిని పాలతో కలిపి తీసుకుంటే అన్ని రోగాలు నయమవుతాయి.

బ్రాహ్మీ: ఆయుర్వేద వైద్యంలో బ్రాహ్మిని చాలా రకాలుగా ఉపయోగిస్తున్నారు. జ్ఞాపకశక్తిని పెంచే లక్షణాలకు బ్రాహ్మి పేరుగాంచింది. ఈ హెర్బ్ వల్ల అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. జుట్టు రాలడం ఆపడానికి మీరు బ్రహ్మీ ఆయిల్ ఉపయోగించవచ్చు. దీన్ని పౌడర్, క్యాప్సూల్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

తులసిని ఆయుర్వేద ఔషధాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. తులసి శ్వాసకోశ సమస్యలు, ప్రేగు సంబంధిత వ్యాధులు, వికారం వంటి వాటిని తగ్గిస్తుంది. దీనిని టీలో వేసుకొని కూడా తాగవచ్చు.

జిన్సెంగ్ మెదడు పనితీరును పెంచడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు దీన్ని పౌడర్ లేదా క్యాప్సూల్స్ రూపంలో తీసుకోవచ్చు.



