Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Popcorn: పాప్‌కార్న్‌ తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి.. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు..

మొక్కజొన్న కంకులు, స్వీట్‌కార్న్‌, మొక్కజొన్న గారెలు ఇలా మొక్కజొన్నతో తయారు చేసిన ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది...

Popcorn: పాప్‌కార్న్‌ తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి.. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు..
పాప్‌కార్న్: అర్థరాత్రి ఆకలిని తగ్గించుకోవడానికి మీరు పాప్‌కార్న్ కూడా తినవచ్చు. మీరు మార్కెట్‌లో పాప్‌కార్న్ ప్యాకెట్‌లను కొనుగోలు చేసి ఇంట్లో ఉంచుకుంటే.. నిమిషాల్లోనే వాటిని చేసుకోని తినవచ్చు. అలాగే సులభంగా జీర్ణం అవుతాయి.
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Apr 27, 2022 | 6:00 AM

మొక్కజొన్న కంకులు, స్వీట్‌కార్న్‌, మొక్కజొన్న గారెలు ఇలా మొక్కజొన్నతో తయారు చేసిన ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే మొక్కజొన్న తయారైన పాప్ కార్న్‌(Popcorn)ను చిన్నల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటూ ఉంటారు. ముఖ్యంగా సినిమాలకు వెళ్లినప్పుడు పాప్ కార్న్‌ తింటారు. మొక్కజొన్న గింజలను కాస్త నూనెలో వేయించడం వల్ల పాప్ కార్న్ తయారవుతుంది. పాప్‌ కార్న్‌ రుచిగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి(Health) ఎంతో మేలు చేస్తుంది. కానీ వీటిలో నెయ్యి(Ghee), ఉప్పు మాత్రం వేయకూడదు. ఇలా వేసిన పాప్ కార్న్ లను తింటే మన ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందట.

పాప్ కార్న్‌లో విటమిన్ బి కాంప్లెక్స్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పాప్ కార్న్‌లో ఉండే ఫైబర్ రక్తంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. షుగర్‌ ఉన్నవారికి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోకుండా చేయడానికి పాప్ కార్న్ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు వివరిస్తున్నారు. పాప్‌ కార్న్‌లో ఫైబర్ వల్ల మనం తీసుకున్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. మధుమేహులకు ఫైబర్ ఫుడ్స్ చాలా అవసరం. కాబట్టి వీరు పాప్ కార్న్‌ను బేషుగ్గా తినొచ్చని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణక్రియ పనితీరును మెరుగుపరిచే జెర్మ్, ఎండోస్పెర్మ్ వంటివి పాప్ కార్న్ లో పుష్కలంగా ఉంటాయి. పేగుల ఆరోగ్యానికి ఫైబర్ ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది మలబద్దకం సమస్యను కూడా తొలగిస్తుంది. పాప్ కార్న్‌లో ఉండే ఫైబర్ ధమనులకు, రక్తనాళాల గోడలకు పేరుకుపోయిన అదనపు కొవ్వులను కూడా కరిగిస్తుంది. పాప్‌ కార్న్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడానికి ఉపయోగపడతాయి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Read Also.. Summer Skin Care: ఎండాకాలంలో రోజ్‌ వాటర్‌తో ఇలా చేస్తే చర్మం కాంతివంతం..!