- Telugu News Lifestyle Food Drinking moringa or drumstick leaves juice for relief from these health issues
Health Care: ఆ సమస్యలు వేధిస్తున్నాయా.. అయితే, మునగ ఆకుల రసంతో చెక్ పెట్టండిలా..
Drumstick leaves juice: మునగ ఆకుల రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేకూరుతుంది. యాంటీ ఆక్సిడెంట్లతో పాటు అనేక విటమిన్లు కూడా ఇందులో ఉంటాయి.
Updated on: Apr 27, 2022 | 8:10 AM

మునగ ఆకుల రసాన్ని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆయుర్వేదంలో కూడా, దీని రసం శరీరానికి ప్రయోజనకరంగా పరిగణిస్తున్నారు. మునగ ఆకుల రసాన్ని తాగడం వల్ల ఎలాంటి శారీరక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

మధుమేహాం: ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి జీవితంలో ఎక్కువ భాగం మందుల వాడకంలోనే గడిచిపోతుంది. శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని స్వదేశీ పద్ధతుల ద్వారా కూడా నియంత్రించవచ్చు. ఇందుకోసం మునగ ఆకుల రసాన్ని రోజూ తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.

ఊబకాయం: ఇది సాధారణ సమస్యగా మారింది. దాని వెనుక కారణాలు చాలా ఉండవచ్చు. ప్రధాన కారణం క్రమపద్ధతి లేని ఆహారం తీసుకోవడం. స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి మునగ ఆకుల సహాయం తీసుకోవచ్చు. దీని రసాన్ని తయారు చేసి ఉదయాన్నే తాగాలి.

బలహీనమైన ఎముకలు: ఎముకలు బలహీనపడటానికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో ఒకటి బరువు పెరగడం. మీ ఎముకలు బలహీనంగా ఉంటే, వాటికి మంచి పోషకాహారం, అవసరమైన విటమిన్లు అవసరం. మీరు మునగ ఆకులతో ఈ లోపాన్ని పూరించవచ్చు.





























