Health Tips: షుగర్, బీపీ పెరిగిపోతుందని టెన్షన్ పడుతున్నారా.. ఉదయాన్నే ఈ మూడు మొక్కల ఆకులు తింటే బెటర్..
బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్ పెరుగుదల రెండూ తీవ్రమైన పరిస్థితులకు దారి తీస్తాయి. వాటిని నియంత్రించకపోతే ఆరోగ్యంపై చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. అయితే, మన ఇంటి చుట్టూ దొరికే కొన్ని చెట్ల, మొక్కల ఆకులను ఉపయోగించి..
మధుమేహం అనేది తీవ్రమైన, నయం చేయలేని వ్యాధి. ఇది ఆరోగ్యకరమైన ఆహారం, క్రియాశీల జీవనశైలి ద్వారా మాత్రమే నియంత్రించేందుకు వీలుంది. ఈ వ్యాధిలో, ప్యాంక్రియాస్ రక్తంలో చక్కెరను నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తిని నెమ్మదిస్తుంది లేదా నిలిపివేస్తుంది. ఇటువంటి పరిస్థితిలో, రోగి రక్తంలో చక్కెర స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా అనేక తీవ్రమైన సమస్యల ప్రమాదం ఏర్పడుతుంది. అదేవిధంగా, అధిక రక్తపోటు కూడా చాలా సాధారణ సమస్యగా మారింది. ఇది నియంత్రించలేకపోతే, గుండె సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. రక్తపోటు అదుపు తప్పడం వల్ల చూపు మందగించడం, అలసట, తలనొప్పి, ముక్కు నుంచి రక్తం కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైనవి ఏర్పడవచ్చు.
అయితే, రక్తపోటు, బ్లడ్ షుగర్ కోసం అనేక మందులు, చికిత్సలు ఉన్నాయి. అయితే కొన్ని సహజ నివారణల ద్వారా మధుమేహం, రక్తపోటు వంటి తీవ్రమైన సమస్యలను కూడా అధిగమించవచ్చు. ఇంట్లో దొరికే కొన్ని చెట్లు, మొక్కల ఆకులకు బ్లడ్ షుగర్, బీపీని నియంత్రించే శక్తి ఉంటుంది. అవేంటి, ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకు..
కరివేపాకు ఆహారం రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య గుణాలను కలిగి ఉంటుంది. తీపి వేపగా ప్రసిద్ధి చెందిన ఈ మొక్క ఆకులు జీర్ణక్రియను బలోపేతం చేస్తాయి. పొట్టకు సంబంధించిన అనేక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మధుమేహం, రక్తపోటు ఉన్నవారు ఈ ఆకులను తప్పనిసరిగా తీసుకోవాలి.
ఎలా ఉపయోగించాలంటే..
కరివేపాకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. ఈ కణాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. చెట్టు నుంచి తాజా ఆకులను తెంచి అలాగే నమలొచ్చు లేదా అనేక కూరల్లో వాడుకోవచ్చు.
వేప ఆకులు..
వేప ఆకుల్లో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ వేప ఆకులను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆధారాలు ఉన్నాయి. మీకు మధుమేహం లేదా మీరు రక్తపోటు ఉన్న రోగి అయితే, వేప ఆకులు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
ఎలా ఉపయోగించాలంటే..
వేప ఆకుల యాంటిహిస్టామైన్ ప్రభావాలు రక్త నాళాలు విస్తరిస్తాయి. రక్తపోటును తగ్గించడంలో ఈ ఆకులు సహాయపడటానికి ఇదే కారణంగా నిలిచింది. ఒక నెల పాటు వేప సారం లేదా క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల కూడా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
తులసి ఆకులు..
తులసిని మూలికల రాణి అని పిలుస్తుంటారు. ఇది శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారిలో ఖాళీ కడుపుతో తులసి ఆకులను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. తులసి ఆకులు లిపిడ్‌లను తగ్గించడం, ఇస్కీమియా, స్ట్రోక్, అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి.
ఎలా ఉపయోగించాలంటే..
ఉదయాన్నే తులసి ఆకులను నమలడం వల్ల బీపీ, బ్లడ్ షుగర్ అదుపులో ఉంటాయి. మీరు ఈ ఆకులను జ్యూస్‌లా చేసుకొని తాగొచ్చు. తులసి ఆకులను ఎక్కువ పరిమాణంలో తినకూడదని మాత్రం గుర్తుంచుకోండి.
గమనిక: ఈ కథనంలో పేర్కన్న సమాచారం, చిట్కాలు, పద్ధతులు సాధారణ సమాచారం కోసం మాత్రమేనని గుర్తించాలి. ఇది ఔషధం లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మీ డాక్టర్‌ని సంప్రదించిన తర్వాతే ఈ పద్ధతులను పాటించాల్సి ఉంటుంది.
మరింత ఆరోగ్య సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Ghee: ఈ వ్యక్తులు నెయ్యిని అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసుకోండి..
Oral Cancer: ఇలాంటి అలవాట్ల కారణంగా నోటి క్యాన్సర్.. లక్షణాలు ఏమిటి..!