Apple Cider Vinegar: యాపిల్ సైడర్ వెనిగర్‌తో బోలెడన్ని ప్రయోజనాలు.. ఎలా ఉపయోగించాలంటే..?
Apple cider vinegar benefits: యాపిల్ సైడర్ వెనిగర్‌ని అందరి ఇళ్లలోనూ వాడుతుంటారు. యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఆహార పదార్థాల్లో ఉపయోగించడమే కాకుండా చర్మ సంరక్షణలో
Apple cider vinegar benefits: యాపిల్ సైడర్ వెనిగర్‌ని అందరి ఇళ్లలోనూ వాడుతుంటారు. యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఆహార పదార్థాల్లో ఉపయోగించడమే కాకుండా చర్మ సంరక్షణలో కూడా ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. యాపిల్ సైడర్ వెనిగర్ ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. దీనితో మీ పాదాలను కూడా సంరక్షించుకోవచ్చు. వెనిగర్‌తో పాదాలను మృదువుగా చేయడంతో పాటు యవ్వనంగా కూడా కనిపిస్తారు. వెనిగర్ సహాయంతో పాదాల కణాలు ఉపశమనం పొందుతాయి. మీ పాదాలలో నొప్పి ఉంటే అది కూడా చాలా వరకు నయమవుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ వల్ల కలిగే ప్రయోజనాలు.. దానిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకోండి..
- పాదాలపై పొడి చర్మాన్ని ఇలా దూరం చేసుకోండి: ఆపిల్ సైడర్ వెనిగర్ ఫుట్ సోక్ సహాయంతో మీ పాదాలు మృదువుగా మారుతాయి. పొడి చర్మం సమస్య కూడా తొలగిపోతుంది. వెనిగర్ సహాయంతో పాదాలను ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. గోర్లు, వేళ్ల ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంటాయి. వెనిగర్ సహాయంతో పాదాలపై ముడతలను కూడా నివారించవచ్చు.
- డెడ్ స్కిన్‌ని వదిలించుకోండి: ఆపిల్ సైడర్ వెనిగర్‌తో తయారు చేసిన ఫుట్ సోక్‌ని ఉపయోగించడం వల్ల పాదాలు శుభ్రంగా మారతాయి. ఎందుకంటే సైడర్ వెనిగర్ మీ పాదాల నుంచి మృత చర్మ కణాలను తొలగించడంలో చాలా సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ఎసిటిక్ యాసిడ్ కలిగి ఉంటుంది. దీని సహాయంతో చర్మం నుంచి చనిపోయిన చర్మ కణాలను తొలగించవచ్చు.
- పాదాల వాసన: వేసవిలో చెమటలు పట్టడం సహజం.. రోజంతా షూస్, సాక్స్ ధరించడం వల్ల పాదాల నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు ఆపిల్ సైడర్ వెనిగర్‌తో తయారు చేసిన ఫుట్ సోక్‌ను ఉపయోగించవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్ చర్మం pH స్థాయిని కూడా సమతుల్యం చేస్తుంది.
- ఫంగల్ ఇన్ఫెక్షన్‌లు: ఆపిల్ సైడర్ వెనిగర్‌తో తయారు చేసిన ఫుట్ సోక్‌ని ఉపయోగిస్తే.. ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య కూడా దూరం అవుతుంది. వేసవిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగిస్తే.. మీరు దీని నుంచి కూడా బయటపడవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్ యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. దీంతో బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
Also Read;