Dry Dates Milk: ఖర్జూరం పాలతో ఈ సమస్యలు దూరం.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. బలమైన ఎముకలు.. ఆరోగ్యకరమైన దంతాల కోసం ప్రతి రోజూ పాలు తాగడం ముఖ్యం.

Dry Dates Milk: ఖర్జూరం పాలతో ఈ సమస్యలు దూరం.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
Dates Milk
Rajitha Chanti

|

Apr 27, 2022 | 8:20 AM

పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. బలమైన ఎముకలు.. ఆరోగ్యకరమైన దంతాల కోసం ప్రతి రోజూ పాలు తాగడం ముఖ్యం. పాలు మాత్రమే కాకుండా.. ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని పోషకాలను కలిపి తీసుకోవడం వలన మరిన్ని లాభాలున్నాయి. పాలతో పాటు.. ఖర్జూరం (Dates Milk) కలిపి తీసుకోవడం వలన ఆరోగ్యానికి మంచిది. ప్రతిరోజూ పనిచేసి అలసిపోయినట్లు అనిపిస్తే.. శారీరక బలహీనత ఉన్నప్పుడు ఖర్జూరం పాలు తీసుకోవడం మేలు చేస్తుంది. అలాగే ఇతర అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం, పిస్తా, డ్రై ఫ్రూట్స్‌లో డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. వీటిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఖర్జూరంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, కాల్షియం, ఫైబర్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ సి, ఇ, కె, బి6 మొదలైనవి ఉన్నాయి. ఖర్జూరం పాలతో కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా.

ప్రయోజనాలు.. * న్యూస్ స్క్రాబ్ డాట్ కామ్ అనే కథనంలో ప్రచురించబడిన ఓ నివేదిక ప్రకారం బరువు చాలా తక్కువగా ఉన్నవారు ఖర్జూరం పాలు తాగితే బరువు పెరుగుతారు. ఎండు ద్రాక్షను పాలలో వేసి మరిగించి తీసుకోవడం వలన బరువు పెరగడమే కాకుండా.. అనేక వ్యాధులు తగ్గుతాయి. ఇందులో కేలరీలు పుష్కలంగా ఉంటాయి. * రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఖర్జూరం పాలు తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ పాలు చాలా మంచిది. * పొడి ఖర్జూరంలో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అజీర్ణాన్ని తగ్గిస్తుంది. ఖర్జూర పాలు ఎంజైమ్ లను పెంచడంలో సహయపడతాయి. దీంతో మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా పేగు సమస్యలు తగ్గుతాయి. * ఖర్జూరం పాలు తీసుకోవడం వలన చర్మం, జుట్టు సమస్యలు తగ్గుతాయి. పాలలో ఖర్జూరం వేసి తీసుకోవడం వలన చర్మం మెరిసిపోవడంతోపాటు.. చర్మానికి పోషకాలు అందుతాయి. అలాగ జుట్టు రాలడం ఆగిపోతుంది. * శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు ఖర్జూరం పాలు తాగాలి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. గర్భాధారణలో.. మహిళలు తరచూ ఐరన్ లోపం, రక్తహీనత సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. గర్భీణి స్త్రీలు వైద్యుడిని సంప్రదించిన తర్వాత పాలు తాగాలి. రక్తం లేకపోవడం వలన అలసట, బలహీనత, నీరసంగా ఉంటుంది. * పాలలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచుంతుంది. ఎండు ఖర్జూరాలను పాలలో మరిగించి తాగితే ఎముకలు, దంతాల సమస్యను తగ్గించవచ్చు. ఖర్జూరంలో కాల్షియం, విటమిన్ సి, ఐరన్, విటమిన్ బి కూడా ఉన్నాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే బోలు ఎముకల వ్యాధి మరియు ఇతర ఎముక సంబంధిత వ్యాధులను నివారించడానికి, ప్రతిరోజూ 2-3 ఎండు ఖర్జూరాలు తీసుకోవాలి. పాలలో రాత్రంతా నానబెట్టి లేదా ఉడికించి తాగితే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది.

గమనిక:- ఈ కథనం కేవలం నిపుణుల అభిప్రాయాలు.. నివేదికల ప్రకారం మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ9 తెలుగు దృవీకరించలేదు. అమలు చేయడానికి ముందు వైద్యులను సంప్రదించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన తమన్.. స్కోర్ స్టార్ట్ అంటూ పోస్ట్..

Viral Photo: చంద్రబింబంలాంటి ఈ చిన్నది.. హీరోయిన్ మాత్రమే కాదు.. నిర్మాతగానూ రాణిస్తోంది.. ఎవరో గుర్తుపట్టండి..

RRR: ఎత్తర జెండా ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. అదరగొట్టిన చరణ్, తారక్..

Salaar Movie: ప్రభాస్ కోసం ప్రశాంత్ నీల్ భారీ ప్లాన్.. ఇంటర్వెల్ సిక్వెన్స్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu