RRR: ఎత్తర జెండా ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. అదరగొట్టిన చరణ్, తారక్..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఆర్ఆర్ఆర్ విడుదలై

RRR: ఎత్తర జెండా ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. అదరగొట్టిన చరణ్, తారక్..
Rrr
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 26, 2022 | 5:53 PM

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఆర్ఆర్ఆర్ (RRR) విడుదలై నెల రోజులు గడుస్తున్న ఇప్పటికీ ఈ మూవీ కలెక్షన్స్ సునామీ సృష్టిస్తూ దూసుకుపోతుంది. ఓవైపు బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేస్తూనే.. మరోవైపు ఇప్పటికే విడుదలైన సాంగ్స్ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి. నాటు నాటు, కొమ్మా ఉయ్యాలా.. దోస్తీ వీడియో సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా తారక్, చరణ్ అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు జక్కన్న. ఈ సినిమా నుంచి సెలబ్రేషన్స్ ఆంథమ్ ఎత్తర జెండా వీడియో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. సినిమా చివరలో ఈ పాట వస్తుంది.

తాజాగా విడుదలైన ఎత్తర జెండా సాంగ్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, ఆలియా భట్ తమ డ్యాన్స్‏తో అదరగొట్టేశారు. అంతేకాకుండా..హాలీవుడ్ బ్యూటీ ఎలివియా మోరీస్, అజయ్ దేవగన్, డైరెక్టర్ రాజమౌళి కనిపించారు. గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించగా.. విశాల్ మిశ్రా, పృథ్వీ చంద్ర, సాహితి చాగంటి, హారిక నారాయణ్ కలిసి ఆలపించారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కాన్సెప్ట్ డిజైన్ చేయగా..హరీష్ కొరియోగ్రఫీ చేశారు. తెలుగుతోపాటు.. హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషలలో విడుదలైన ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించి మెప్పించగా.. అజయ్ దేవగణ్, శ్రియా కీలకపాత్రలలో నటించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Chinni Trailer: వైలెంట్ పాత్రలో అదగొట్టేసిన కీర్తి సురేష్.. ఆకట్టుకుంటున్న చిన్ని ట్రైలర్..

Suma Kanakala: విడాకుల రూమర్లపై స్పందించిన యాంకర్ సుమ.. ఏమన్నదంటే..

Megastar Chiranjeevi: సిద్ధ పాత్ర రామ్ చరణ్ చేయకపోతే పవన్ కళ్యాణ్ బెస్ట్.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వైరల్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!