AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suma Kanakala: విడాకుల రూమర్లపై స్పందించిన యాంకర్ సుమ.. ఏమన్నదంటే..

యాంకర్ సుమ (Anchor Suma).. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. తన వాక్చాతుర్యంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా..

Suma Kanakala: విడాకుల రూమర్లపై స్పందించిన యాంకర్ సుమ.. ఏమన్నదంటే..
Suma
Rajitha Chanti
|

Updated on: Apr 26, 2022 | 3:13 PM

Share

యాంకర్ సుమ (Anchor Suma).. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. తన వాక్చాతుర్యంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. రియాల్టీ షోస్ చేస్తూ టాప్ యాంకర్‏గా కొనసాగుతుంది. చాలా కాలం తర్వాత సుమ వెండితెరపై సందడి చేయబోతుంది. జయమ్మ పంచాయితీ సినిమాతో మరోసారి సినీ ప్రియులను అలరించనుంది. ఈ చిత్రానికి కలివరపు విజయ్ కుమార్ దర్శకత్వం వహించగా.. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు సుమ కనకాల. ఈ క్రమంలోనే ఆలీతో సరదాగా షోకు గెస్టుగా వచ్చారు సుమ. తాజాగా విడుదలైన ఎపిసోడ్ ప్రోమోలో సుమ… తనకు.. తన భర్త పై వచ్చిన రూమర్స్ పై స్పందించింది.

కరోనా సమయంలో మీ బంధంపై రూమర్స్ వచ్చాయి.. మీరు విడిపోతున్నారంటూ.. వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారని గాసిప్స్ వచ్చాయని ప్రశ్నించాడు ఆలీ. ఇందుకు సుమ స్పందిస్తూ.. ఇద్దరి మధ్యలో గొడవలు వాస్తవమే.. ఈ 23 ఏళ్లలో ఎన్నో గొడవలు.. కానీ ఒకటి మాత్రం నిజం.. భార్యభర్తలుగా విడాకులు తీసుకోవడం సులభమే. కానీ తల్లిదండ్రులుగా చాలా కష్టమంటూ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే సుమ ఏం చెప్పిందో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Sarkaru Vaari Paata: దూసుకుపోతోన్న కళావతి సాంగ్.. యూట్యూబ్‌లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన సర్కారు వారి పాట

Acharya Movie: మెగాస్టార్‌ సినిమాకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. పదిరోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఉత్తర్వులు..

Acharya Press Conference: నేను ప్రతి ఒక్కరిలోనూ ఆచార్యను చూస్తుంటాను : మెగాస్టార్ చిరంజీవి

Mani Ratnam: ‘దక్షిణాది సినిమాల విజయాలను ఎవ్వరూ ఆపలేరు’.. మణిరత్నం సంచలన కామెంట్స్