Acharya Movie: మెగాస్టార్ సినిమాకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. పదిరోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఉత్తర్వులు..
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య (Acharya). చిరు తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య (Acharya). చిరు తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే ఆచార్య సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( AP Government) శుభవార్త చెప్పింది. పదిరోజుల పాటు రూ.50 పెంచుకునేందుకు అంగీకారం తెలిపింది. సినిమా నిర్మాణ బడ్జెట్ రూ.100కోట్లు దాటిన నేపథ్యంలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. టికెట్ రేట్ల విషయంలో స్పష్టత నిచ్చినా ఐదో షో విషయంలో మాత్రం ఏపీ సర్కార్ క్లారిటీ ఇవ్వలేదు.
కాగా నిన్న తెలంగాణ ప్రభుత్వం కూడా ఆచార్య సినిమా టికెట్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29 నుంచి మే 5 వరకు ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఒక్కో టికెట్ పై మల్టీప్లెక్స్‌ల్లో రూ.50, సాధారణ ఏసీ థియేటర్లలో రూ.30 పెంచుకునేందు అనుమతించింది. అలాగే వారం రోజులపాటు ఐదో ఆట ప్రదర్శనకు అంగీకారం తెలిపింది. కాగా ఆర్‌ఆర్‌ఆర్, రాధేశ్యామ్ చిత్రాలకు కూడా టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రాలకు తొలి పది రోజులకు ఈ వెసులుబాటు కల్పిస్తోంది.
మరిన్ని ఎంటర్ టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read:
Hyderabad: సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు భూమి పూజ చేయనున్న సీఎం కేసీఆర్.. లైవ్ వీడియో
నేడు Nokia G21, Nokia G11 మొబైల్స్ లాంచ్.. ధర, ఫీచర్లు గురించి తెలుసుకోండి..!