Mani Ratnam: ‘దక్షిణాది సినిమాల విజయాలను ఎవ్వరూ ఆపలేరు’.. మణిరత్నం సంచలన కామెంట్స్
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా మూవీల హవా నడుస్తుంది. బాహుబలి సినిమా మొదలు పెట్టిన ఈ రేస్ లో సౌత్ సినిమాలు దూసుకుపోతున్నాయి.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా మూవీల హవా నడుస్తుంది. బాహుబలి సినిమా మొదలు పెట్టిన ఈ రేస్ లో సౌత్ సినిమాలు దూసుకుపోతున్నాయి. విడుదలైన అన్ని భాషల్లో సత్తా చాటుతూ సౌత్ సినిమాల రేంజ్ ఏంటో చూపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన కన్నడ సినిమా కేజీఎఫ్ చాఫ్టర్ 2, జక్కన్న దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా టాలీవుడ్ బాలీవుడ్ తో పాటు తమిళ్ లోనూ సంచలన విజయాన్ని సాధించాయి. అయితే ఇటీవల దళపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమా కేజీఎఫ్ 2కి పోటీగా రిలీజ్ అయ్యి బొక్కబోర్లా పడింది. సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో విజయ్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అదే సమయంలో కేజీఎఫ్ 2 రికార్డులు, ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ అంటూ హడావిడి చేయడంతో తమిళ తంబీలు కాస్త గుర్రుగా ఉన్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం కూడా పాన్ ఇండియా సినిమాల పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా మణిరత్నం మాట్లాడుతూ.. హాలీవుడ్ సినిమాలు తమిళనాడులో ఘన విజయం సాధిస్తున్నాయి.. అలాంటప్పుడు కన్నడ , తెలుగు సినిమాలు మన దగ్గర విజయం సాధిస్తే తప్పేంటి అని అన్నారు. దక్షిణాది సినిమాలు తమ పరిధిని పూర్తిగా పెంచుకున్నాయి. ఇతర భాషల సినిమాలను చూసి మనం భయపడనవసరం లేదు అని మణిరత్నం అన్నారు. తమిళ పరిశ్రమ మిగతా పరిశ్రమలకు ఎప్పటికి గట్టి పోటీ ఇస్తుంది. సినిమాల నిర్మాణంలో వారితో పోలిస్తే తమిళ పరిశ్రమ ఎక్కడ తక్కువ కాదు . పరిశ్రమలో పోటీ ఆరోగ్యకరం గా ఉండాలి. తెలుగు,కన్నడ భాషలకు సంబంధించిన సినిమా విజయాల్ని ఎవ్వరు ఆపలేరు. కొత్త, కొత్త డైరెక్టర్స్ బిగ్ స్క్రీన్స్ ఫై విజువల్ వండర్స్ సృష్టిస్తున్నారు. ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ పెరిగాయి. టెక్నాలజీ ని అడాప్ట్ చేసుకోని నేటి దర్శకులు గొప్పగా రాణిస్తున్నారు అని మణిరత్నం అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని ఇక్కడ చదవండి :