Viral Photo: చంద్రబింబంలాంటి ఈ చిన్నది.. హీరోయిన్ మాత్రమే కాదు.. నిర్మాతగానూ రాణిస్తోంది.. ఎవరో గుర్తుపట్టండి..

ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్ల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి . తమ అభిమాన తారలను గుర్తుపట్టేందుకు

Viral Photo: చంద్రబింబంలాంటి ఈ చిన్నది.. హీరోయిన్ మాత్రమే కాదు.. నిర్మాతగానూ రాణిస్తోంది.. ఎవరో గుర్తుపట్టండి..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 26, 2022 | 8:33 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్ల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి . తమ అభిమాన తారలను గుర్తుపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఓ చిన్నారి ఫోటో నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. చంద్రబింబంలాంటి మోము.. బూరె బుగ్గలు.. అమాయకపు చూపులతో చూపు తిప్పుకోనివ్వని ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. అంతేకాదు.. నిర్మాతగానూ రాణిస్తోంది. ప్రభాస్.. ఎన్టీఆర్.. రవితేజ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ అమ్మడు.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..

ఈ చిన్నారి మరెవరో కాదండోయ్ .. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఛార్మీ కౌర్. నితిన్ నటించిన శ్రీఆంజనేయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత.. గౌరి, చంటి, మాస్, చక్రం, అనుకోకుండా ఒక రోజు, అల్లరి పిడుగు, చుక్కల్లో చంద్రుడు, లక్ష్మీ, పౌర్ణమి, మంత్ర, సుందరకాండ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం నటిగా కాకుండా.. తెలుగు చిత్రపరిశ్రమలో నిర్మాతగా రాణిస్తోంది. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‏తో కలిసి పూరీ కనెక్ట్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తుంది ఛార్మి. ఛార్మీ ప్ర‌స్తుతం పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా లైగ‌ర్ అనే చిత్రాన్ని నిర్మిస్తుంది.

View this post on Instagram

A post shared by Charmmekaur (@charmmekaur)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Chinni Trailer: వైలెంట్ పాత్రలో అదగొట్టేసిన కీర్తి సురేష్.. ఆకట్టుకుంటున్న చిన్ని ట్రైలర్..

Suma Kanakala: విడాకుల రూమర్లపై స్పందించిన యాంకర్ సుమ.. ఏమన్నదంటే..

Megastar Chiranjeevi: సిద్ధ పాత్ర రామ్ చరణ్ చేయకపోతే పవన్ కళ్యాణ్ బెస్ట్.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వైరల్..

RRR: ఎత్తర జెండా ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. అదరగొట్టిన చరణ్, తారక్