AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన తమన్.. స్కోర్ స్టార్ట్ అంటూ పోస్ట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu).. కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata).

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన తమన్.. స్కోర్ స్టార్ట్ అంటూ పోస్ట్..
Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: Apr 26, 2022 | 9:17 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu).. కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ చిత్రానికి డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఇందులో మహేష్ బాబు సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు , టీజర్ సినిమా పై ఓ రేంజ్ లో ఎక్స్పెటెషన్స్ క్రియేట్ చేశాయి. ఇక ఈ మూవీ కోసం తమన్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తుంది. సర్కారు వారి పాట సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. తాజాగా సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ పై అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమా ట్రైలర్‏కు సంబంధించిన అప్డేట్ ఏప్రిల్ 27న ఇవ్వనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్.

అయితే సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆసక్తికర పోస్ట్ చేశాడు.. బెస్ట్ ఎవర్ ట్రైలర్ స్కోర్ రేపు మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. డైరెక్టర్ పరశురామ్.. సూపర్ స్టార్ మహేష్ బాబుపై వర్క్ పై ప్రశంసలు కురిపించారు. అయితే ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సర్కారు వారి పాట ట్రైలర్ మే 1న విడుదల చేయనున్నారట. ఫుల్ మాస్ యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ఉండనుందని టాక్ నడుస్తోంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎం బీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మే 12న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

Also Read: Chinni Trailer: వైలెంట్ పాత్రలో అదగొట్టేసిన కీర్తి సురేష్.. ఆకట్టుకుంటున్న చిన్ని ట్రైలర్..

Suma Kanakala: విడాకుల రూమర్లపై స్పందించిన యాంకర్ సుమ.. ఏమన్నదంటే..

Megastar Chiranjeevi: సిద్ధ పాత్ర రామ్ చరణ్ చేయకపోతే పవన్ కళ్యాణ్ బెస్ట్.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వైరల్..

RRR: ఎత్తర జెండా ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. అదరగొట్టిన చరణ్, తారక్