AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar Movie: ప్రభాస్ కోసం ప్రశాంత్ నీల్ భారీ ప్లాన్.. ఇంటర్వెల్ సిక్వెన్స్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా..

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ప్రస్తుతం కేజీఎఫ్ 2 సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటించిన

Salaar Movie: ప్రభాస్ కోసం ప్రశాంత్ నీల్ భారీ ప్లాన్.. ఇంటర్వెల్ సిక్వెన్స్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Apr 26, 2022 | 4:48 PM

Share

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ప్రస్తుతం కేజీఎఫ్ 2 సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోనూ ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇక కేజీఎఫ్ 2 సంచలన విజయం తర్వాత.. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ తమ హీరోను డైరెక్టర్ ఎలా చూపించబోతున్నారో అంటూ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా సలార్. ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. బొగ్గు గనుల నేపథ్యంలో పూర్తి యాక్షన్ థ్రిల్లర్ గా నిర్మిస్తోన్న ఈ మూవీలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం.. ఈ సినిమాలోని ఇంటర్వెల్ సీక్వెన్స్ ఓ లోయలో జరుగుతుందట. అండర్ గ్రౌండ్ లో తెరకెక్కించే సన్నివేశాలు చూస్తే ఒళ్లు గగుర్బొడిచేలా ఉంటాయని అలాగే లోయలోనే ఛేజింగ్ సన్నివేశాలు కూడా ఉన్నాయట. అంటే హాలీవుడ్ స్థాయిలో సన్నివేశాలు ఉంటాయని.. ఇక ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ. 20 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ ఈ సినిమా తదుపరి షెడ్యూల్‏కు సిద్ధమవుతున్నారట మేకర్స్. మే మొదటివారంలో తదుపరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుందని.. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసి.. వేసవి తర్వాత యాక్షన్ సీన్స్ చేయనున్నారట. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలతోపాటు.. ప్రభాస్.. ఆదిపురుష్, స్పిరిట్, ప్రాజెక్ట్ కే చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Chinni Trailer: వైలెంట్ పాత్రలో అదగొట్టేసిన కీర్తి సురేష్.. ఆకట్టుకుంటున్న చిన్ని ట్రైలర్..

Suma Kanakala: విడాకుల రూమర్లపై స్పందించిన యాంకర్ సుమ.. ఏమన్నదంటే..

Megastar Chiranjeevi: సిద్ధ పాత్ర రామ్ చరణ్ చేయకపోతే పవన్ కళ్యాణ్ బెస్ట్.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వైరల్..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?