CBSE Syllabus: సీబీఎస్‌ఈ సిలబస్‌లో మార్పులు..10వ తరగతిలో 25 కొత్త టాపిక్‌లు..12వ తరగతిలో 30 కొత్త టాపిక్‌లు..!
CBSE Syllabus: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కొత్త సెషన్ కోసం కొత్త సిలబస్‌ను విడుదల చేసింది. ఈ సిలబస్‌లో అనేక మార్పులు
CBSE Syllabus: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కొత్త సెషన్ కోసం కొత్త సిలబస్‌ను విడుదల చేసింది. ఈ సిలబస్‌లో అనేక మార్పులు చేశారు. ఇక నుంచి విద్యార్థులు కొత్త సిలబస్ ప్రకారం చదవాలి. 12వ తరగతి సిలబస్‌లో 30 కొత్త అంశాలను చేర్చారు. అదే సమయంలో 10వ తరగతి సిలబస్‌లో 25 అంశాలను చేర్చారు. గతంలో కరోనా కారణంగా బోర్డు సిలబస్‌ను తగ్గించడంతో పాటు రెండు భాగాలుగా విభజించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పాత, కొత్త అంశాలను కలగలిపి సిలబస్ మరింత పెరిగింది. 12వ తరగతి గురించి చెప్పాలంటే ఈ సెషన్‌లో 75 అంశాలను చదవాల్సి ఉంటుంది. అదే సమయంలో 10వ తరగతిలో 85 అంశాలను బోధిస్తారు.
అనేక అంశాలు తీసివేశారు..
పాత సిలబస్ నుంచి కొన్ని అంశాలని తొలగించారు. ప్రజాస్వామ్యం, వైవిధ్యానికి సంబంధించిన పాఠాలను బోర్డు తొలగించింది. సెంట్రల్ ఇస్లామిక్ ల్యాండ్స్ గురించి 11వ హిస్టరీ సబ్జెక్ట్‌లో చేర్చారు. 10వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకం నుంచి షాయర్ ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత్వాన్ని, 11వ చరిత్ర పుస్తకం నుంచి ఇస్లాం స్థాపన, పెరుగుదల, విస్తరణ కథను తొలగించింది. 12వ తరగతిలో మొఘల్ సామ్రాజ్యం పాలన, పరిపాలనపై ఒక అధ్యాయం మార్చారు.
CBSE పరీక్ష విధానం మారే అవకాశాలు
విద్యార్థులు వచ్చే సంవత్సరం నుంచి టర్మ్ పరీక్షలు ఉంటాయా లేదా ఒకే పరీక్ష ఉంటుందా అనే సందేహంలో ఉన్నారు. అయితే పరీక్షల సరళిపై సీబీఎస్ఈ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీనిపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీబీఎస్ఈ తెలిపింది. కానీ కొత్త సిలబస్ విడుదలయ్యాక వచ్చే ఏడాది నుంచి రెండు టర్మ్‌లు ఉండవని తేలిపోయింది. ఎందుకంటే సిలబస్‌ని రెండు భాగాలుగా విభజించలేదు. CBSE టర్మ్ 2 పరీక్ష ఏప్రిల్ 26 నుంచి అంటే ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ పరీక్షకు 35 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. డిసెంబర్‌లో టర్మ్ 1 పరీక్ష పూర్తయిన సంగతి తెలిసిందే.
మరిన్ని కెరియర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి