TSPSC Jobs: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారు.. పరీక్ష విధానం, మార్కులు, సిలబస్‌ను ప్రకటించిన ప్రభుత్వం

TSPSC Jobs: తెలంగాణలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో ఉద్యోగాల జాతర ఉండటంతో అర్హులైన ..

TSPSC Jobs: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారు.. పరీక్ష విధానం, మార్కులు, సిలబస్‌ను ప్రకటించిన ప్రభుత్వం
Follow us
Subhash Goud

|

Updated on: Apr 26, 2022 | 12:02 PM

TSPSC Jobs: తెలంగాణలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో ఉద్యోగాల జాతర ఉండటంతో అర్హులైన వారు ఉద్యోగాన్ని (Jobs) సంపాదించేందుకు పుస్తకాలతో కుస్తి పడుతున్నారు. కొందరు ప్రైవేటు ఉద్యోగాలను మానేసి పరీక్ష కోసం సంసిద్ధమవుతున్నారు. అయితే చాలా మందిలో ఎలాంటి సిలబస్‌ ఉంటుంది.. పరీక్ష ఎలా ఉంటుంది.. ఎన్ని మార్కులు ఉంటాయనేదానిపై అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్న తరుణంలో ప్రభుత్వం అందుకు సంబంధించిన పూర్తి వివరానలు వెల్లడించింది. పరీక్ష విధానం, మార్కులు, సిలబర్‌ తదితర అంశాలను వెల్లడించింది ప్రభుత్వం. ఈ సందర్భంగా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్‌ -1,2,3,4 పరీక్షలకు సంబంధించి మరో ముందడుగు పడినట్లయ్యింది. ప్రత్యక్ష నియామకాల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విధానంపై సోమవారం సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు (జీవో నెం.55) జారీ చేసింది. గ్రూప్‌-1లో 503, గ్రూప్‌-2లో 582, గ్రూప్‌-3లో 1373, గ్రూప్‌-4లో 9168 పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది. పోస్టుల వర్గీకరణ, పరీక్ష విధానం, సిలబస్‌ వివరాలు ప్రకటించారు. అయితే ఇంటర్వ్యూలు రద్దు చేయాలనే అంశంపై అధికారికంగా మాత్రం అమోదం లభించలేదు. తుది ర్యాంకుల ఖరారు పరిగణలోకి తీసుకునే మార్కులు, పరీక్ష/ పేపర్ల వారీ అర్హత సాధించడానికి తప్పనిసరి పొందాల్సిన మార్కుల శాతం తదితర అంశాలపై స్పష్టత ఇచ్చింది టీఎస్‌పీఎస్సీ. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో ఆయా కేటగిరీలు, విభాగాల నుంచి ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నట్లు తెలిపింది.

గ్రూప్‌-1లో 19 రకాల పోస్టులకు రాత పరీక్ష:

కాగా, గ్రూప్‌-1లో 19 రకాల పోస్టులకు 900 మార్కులతో రాతపరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వుల్లో వెల్లడించారు. గ్రూప్‌-2లో 16 రకాల పోస్టులకు 600 మార్కులకు రాతపరీక్ష ఉండనుంది. గ్రూప్‌-3లో 8 రకాల పోస్టులకు 450 మార్కులతో రాతపరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్‌-4లో జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులకు 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహించాలని నిర్దేశించింది. గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో మల్టీజోన్ల వారీగా అభ్యర్థుల ఎంపిక జరగనుంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో నియామక పరీక్షలుంటాయి. గ్రూప్స్‌ విభాగంలో భర్తీకానీ ఇతర ఉద్యోగాలకు ప్రత్యేక పరీక్ష విధానం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

గ్రూప్‌-1:

ప్రిలిమినరీ పరీక్ష 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. ప్రధాన పరీక్షలో ఆరు పేపర్లు ఉంటాయి. 900 మార్కులు కేటాయించారు. మెయిన్స్‌లో 150 మార్కులకుండే ఇంగ్లిష్‌ పేపర్‌లో అర్హత సాధిస్తే సరిపోతుంది. తుది ఎంపికలో ప్రిలిమినరీ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.

గ్రూప్‌-1లో పోస్టులు:

  1. డిప్యూటీ కలెక్టర్‌
  2. డీఎస్పీ (కేటగిరీ-2)
  3. వాణిజ్య పన్నుల అధికారి
  4. జిల్లా పంచాయతీ అధికారి
  5. జిల్లా రిజిస్ట్రార్‌
  6. ప్రాంతీయ రవాణా అధికారి
  7. డివిజనల్‌ ఫైర్‌ అధికారి
  8. డీఎస్పీ (కారాగార విభాగం-పురుషులు)
  9. మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-2
  10. సహాయ డైరెక్టర్‌ / జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి
  11. జిల్లా బీసీ సంక్షేమాధికారి / సహాయ డైరెక్టర్‌
  12. జిల్లా గిరిజన సంక్షేమాధికారి
  13. జిల్లా ఉపాధి కల్పన అధికారి
  14. సహాయ కార్మికశాఖ కమిషనర్‌
  15. సహాయ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌
  16. వైద్య ఆరోగ్య విభాగం: పరిపాలన అధికారి, ట్రెజరర్‌ గ్రేడ్‌-2
  17. సహాయ ఖజానా అధికారి, సహాయ గణాంక అధికారి, శిక్షణ కళాశాల, పాఠశాలలో సహాయ లెక్చరర్‌
  18. అడిట్‌ విభాగంలో సహాయ ఆడిట్‌ అధికారి
  19. మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి

పరీక్ష విధానం: 150 మార్కులు.. ప్రిలిమినరీ పరీక్ష – జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీస్‌ 150 ప్రశ్నలు – రెండున్నర గంటలు.

ప్రధాన పరీక్ష: జనరల్‌ ఇంగ్లిష్‌ (అర్హతపరీక్ష) – 3 గంటలు – మార్కులు- 150

పేపర్‌-1 జనరల్‌ ఎస్సే – 3 గంటలు – 150 మార్కులు సామాజిక సమస్యలు, అంశాలు:

☛ ఆర్థికాభివృద్ధి, న్యాయం

☛ భారత రాజకీయాలు, మార్పులు

☛ భారత చరిత్ర, సాంస్కృతిక వారసత్వం

☛ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అభివృద్ధి

☛ విద్య, మానవ వనరుల అభివృద్ధి

☛ 1. 1757-1947 వరకు భారత దేశ చరిత్ర, సంస్కృతి

పేపర్‌-2 చరిత్ర, సంస్కృతి, భౌగోళికశాస్త్రం: 3 గంటలు, మార్కులు -150:

☛ తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం

☛ భారత దేశ, తెలంగాణ భౌగోళిక స్వరూపం

పేపర్‌-3 – భారతదేశ సమాజం, రాజ్యాంగం, పరిపాలన – 3 గంటలు – 150 మార్కులు

☛ భారత దేశ సమాజం, ఆకృతి, సమస్యలు, సామాజిక ఉద్యమాలు 2. భారత రాజ్యాంగం

☛పరిపాలన

పేపర్‌-4 – ఆర్థికశాస్త్రం, అభివృద్ధి – 3 గంటలు – 150 మార్కులు

☛ భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి

☛తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి

☛ పర్యావరణ సమస్యలు

పేపర్‌-5 – సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌, 3 గంటలు, 150 మార్కులు:

☛ సైన్స్‌ విజ్ఞానంలో ఆధునికత వినియోగం

☛సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రాముఖ్యత, ప్రభావం

☛ డేటా ఇంటర్‌ప్రెటేషన్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌

పేపర్‌-6 – తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం – 3 గంటలు – 150 మార్కులు

☛ తెలంగాణ ఆలోచన, సమీకరణ దశ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం

గ్రూప్‌-2:

గ్రూప్‌-2 సర్వీసులకు మొత్తం 600 మార్కులకు పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం నాలుగు పేపర్లు. ఒక్కోపేపర్‌ నుంచి 150 చొప్పున మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. ప్రతిపేపర్‌కు రెండున్నర గంటల సమయం ఉంటుంది. ఒక్కో పేపర్‌కు గరిష్ట మార్కులు 150 ఉంటాయి.

పోస్టులు:

  1. మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-3
  2. సహాయ వాణిజ్యపన్నుల అధికారి
  3. డిప్యూటీ తహశీల్దార్లు
  4. సబ్‌రిజిస్ట్రార్‌ గ్రేడ్‌-2 (రిజిస్ట్రేషన్‌ సర్వీసులు)
  5. జూనియర్‌ ఉపాధికల్పన అధికారి
  6. సహాయ రిజిస్ట్రార్‌ (సహకార సర్వీసులు)
  7. సహాయ కార్మిక అధికారి
  8. ఎగ్జిక్యూటివ్‌ అధికారి గ్రేడ్‌-2
  9. ఎక్స్‌టెన్షన్‌ అధికారి / మండల పంచాయతీ అధికారి (పంచాయతీరాజ్‌ సర్వీసులు)
  10. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌
  11. సహాయ అభివృద్ధి అధికారి (చేనేత, టెక్స్‌టైల్‌ సర్వీసులు)
  12. కార్యనిర్వహణాధికారి గ్రేడ్‌-1 (దేవాదాయశాఖ)
  13. సహాయ సెక్షన్‌ అధికారి (ఆర్థికశాఖ, సచివాలయ సర్వీసులు)
  14. సహాయ సెక్షన్‌ అధికారి (న్యాయశాఖ, సచివాలయ సర్వీసులు)
  15. సహాయ సెక్షన్‌ అధికారి (సచివాలయ సర్వీసులు)
  16. సహాయ సెక్షన్‌ అధికారి (శాసన సర్వీసులు)

పరీక్ష విధానం:

పేపర్‌-1 – జనరల్‌ ఎబిలిటీస్‌, స్టడీస్‌ – 150 ప్రశ్నలు. సమయం రెండున్నర గంటలు, మార్కులు- 150 పేపర్‌-2 – చరిత్ర, రాజకీయం, సమాజం, 150 ప్రశ్నలు, సమయం రెండున్నర గంటలు. మార్కులు- 150

☛ భారతదేశ, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర (50 ప్రశ్నలు)

☛ భారత రాజ్యాంగం, రాజకీయాలు (50 ప్రశ్నలు)

☛ సామాజిక సమస్యలు, ప్రజా విధానాలు (50 ప్రశ్నలు)

పేపర్‌-3 – ఆర్థికవ్యవస్థ, అభివృద్ధి – 150 ప్రశ్నలు – రెండున్నర గంటలు – 150 మార్కులు

☛ భారత ఆర్థిక వ్యవస్థ: సమస్యలు, సవాళ్లు (50 ప్రశ్నలు)

☛ తెలంగాణ ఆర్థిక, అభివృద్ధి (50 ప్రశ్నలు)

☛ అభివృద్ధి, మార్పులు – సమస్యలు (50 ప్రశ్నలు)

పేపర్‌-4 – తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం – 150 ప్రశ్నలు – రెండున్నర గంటలు – 150 మార్కులు

☛ తెలంగాణ ఆలోచన (1948-1970) (50 ప్రశ్నలు)

☛ సమీకరణ దశ (1971-1990) (50 ప్రశ్నలు)

☛ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (1991-2014) (50 ప్రశ్నలు)

గ్రూప్‌-3:

ఇందులో 8 సర్వీసులు ఉంటాయి. పరీక్షలో 450 మార్కులకు గాను ఉంటుంది. ఇందులో 3 పేపర్లు, ఒక్కో పేపర్‌లో 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. సమయం: రెండున్నర గంటలు ఉంటుంది. ఈ పరీక్షను తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు.

పోస్టులు:

  1. సీనియర్‌ అకౌంటెంట్‌ (ప్రభుత్వ బీమా సేవలు)
  2. ఆడిటర్‌ (పే అండ్‌ అకౌంట్స్‌ సర్వీసులు)
  3. జూనియర్‌ అసిస్టెంట్స్‌ (విభాగాధిపతులు)
  4. సహాయ ఆడిటర్‌ (పే అకౌంట్స్‌ సేవలు)
  5. సీనియర్‌ అకౌంటెంట్‌ (ఖజానా, అకౌంట్స్‌ సేవలు)
  6. సీనియర్‌ ఆడిటర్‌ (స్థానిక నిధులు, ఆడిట్‌ సేవలు)
  7. జూనియర్‌ అకౌంటెంట్‌ (ప్రభుత్వ బీమా సేవలు)
  8. జూనియర్‌ అకౌంటెంట్స్‌ (డైరెక్టరేట్‌, ఖజానా, అకౌంట్స్‌ సేవలు)

పరీక్ష విధానం:

పేపర్‌-1 – జనరల్‌ స్టడీస్‌, ఎబిలిటీస్‌ – ప్రశ్నలు-150 ప్రశ్నలు, సమయం-రెండున్నర గంటలు, మార్కులు -150 పేపర్‌-2 – చరిత్ర, రాజకీయాలు, సమాజం – ప్రశ్నలు-150, సమయం- రెండున్నర గంటలు, మార్కులు-150

☛ తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, రాష్ట్ర ఏర్పాటు (50 ప్రశ్నలు)

☛ భారత రాజ్యాంగం, రాజకీయాలు (50 ప్రశ్నలు)

☛ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ది (50 ప్రశ్నలు)

☛ అభివృద్ధి, మార్పులు – సమస్యలు (50 ప్రశ్నలు)

☛ సామాజిక స్వరూపం, సమస్యలు, ప్రజా విధానాలు (50 ప్రశ్నలు)

పేపర్‌-3 – ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి – 150 – రెండున్నర గంటలు – 150 మార్కులు

☛ భారత ఆర్థిక వ్యవస్థ: సమస్యలు, సవాళ్లు (50 ప్రశ్నలు)

గ్రూప్‌-4:

ఇందులో వివిధ ప్రభుత్వ విభాగాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌, అకౌంటెంట్స్‌ తదితర పోస్టులు ఉంటాయి. సాధారణ పోస్టులకు జనరల్‌ స్టడీస్‌ 150 మార్కులు, సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌కు 150 మార్కులు కలిపి మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌లో 150 ప్రశ్నలు నిర్వహిస్తారు.

గెజిటెడ్‌ అధికారుల పోస్టులు:

☛ గ్రూపు-1, గ్రూపు-2లతో సంబంధం లేని గెజిటెడ్‌ ఉద్యోగాల భర్తీలో కి 450 మార్కులతో పరీక్ష ఉంటుంది. ఇందులో మొదటి పేపర్‌లో జనరల్‌ స్టడీస్‌, ఎబిలిటీఎస్‌లో 150 ప్రశ్నలకు 150 నిమిషాల సమయం ఉంటుంది. అలాగే 150 మార్కులుంటాయి. పేపర్‌-2లో సంబంధిత సబ్జెక్ట్‌లో 150 ప్రశ్నలకు 150 నిమిషాల్లో సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులుంటాయి.

నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు: గ్రూపులతో సంబంధం లేని నాన్‌ గెజిటెడ్‌ పోస్టులకు మొత్తం రెండు పేపర్లలో కలిపి 300 మార్కులు ఉంటాయి. మొదటి పేపర్‌లో జనరల్‌ స్టడీస్‌, ఎబిలిటీస్‌ 150 ప్రశ్నలకు 150 నిమిషాల్లో, రెండో పేపర్‌లో సబ్జెక్టుకు 150 ప్రశ్నలకు 150 నిమిషాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

ఇతర పోస్టులు: అసిస్టెంటు ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌ పోస్టుల పరీక్షలో 4 పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తారు. వీటికి 650 మార్కులు ఉంటాయి. 450 ప్రశ్నలకు 450 నిమిషాల్లో సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి పేపర్‌లో జనరల్‌ ఇంగ్లిష్‌, రెండో దానిలో జనరల్‌ స్టడీస్‌, ఆప్షనల్‌ 1, 2 పేపర్లు ఉంటాయి.

☛ ఫారెస్ట్‌ రేంజి అధికారి, జిల్లా సైనిక సంక్షేమాధికారి పోస్టులకు 450 మార్కులుంటాయి.

☛ సూపర్‌వైజర్‌, మేట్రన్‌ గ్రేడ్‌-2, వసతి గృహాధికారి గ్రేడ్‌-2 పోస్టులకు రెండు పేపర్లకు గానూ 300 ప్రశ్నలకు 300 మార్కులు ఉంటాయి.

☛ శాసనసభలో సహాయ అనువాదకుని పోస్టుకు 300 మార్కులకు ప్రశ్నలు ఉండగా, సీనియర్‌ రిపోర్టర్‌ పోస్టులకు 150 మార్కుల చొప్పున షార్ట్‌హాండ్‌ పరీక్ష ఉంటుంది.

సిలబస్‌:

☛ పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌లో పదో తరగతి స్థాయిలో చరిత్ర ఉంటుంది. అలాగే భూగోళశాస్త్రం, పౌరశాస్త్రం, ఎకనామిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, వర్తమానాంశాలు, బాలల హక్కులు అంశాలపై సిలబస్‌ ఉంటుంది.

అర్హత మార్కులు:

☛ ఈ పోస్టులకు ఓసీ, ఈడబ్ల్యూఎస్‌, క్రీడా, మాజీ సైనికుల కోటా కేటగిరి అభ్యర్థులు 40 శాతం మార్కులు పొందడం తప్పనిసరి. బీసీలకు 35 శాతం, ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులకు 30 శాతం మార్కులు రావడం తప్పనిసరి. అలాగే గ్రూపు-1 పోస్టుల్లో మెయిన్స్‌కు మాత్రమే అర్హత మార్కులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రాతపరీక్షలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేస్తారు.

మరిన్ని కెరీర్ – ఉద్యోగాలకు సంబంధించిన వార్తల కోసం ఇక్కల క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

CBSE Syllabus: సీబీఎస్‌ఈ సిలబస్‌లో మార్పులు..10వ తరగతిలో 25 కొత్త టాపిక్‌లు..12వ తరగతిలో 30 కొత్త టాపిక్‌లు..!

BSF Group B Recruitment 2022: బీఎస్‌ఎఫ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు.. ఏప్రిల్‌ 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ..