Malaria Disease: మలేరియా ఎలా వ్యాపిస్తుంది..? దేశంలో ప్రతి సంవత్సరం ఎన్ని కేసులు నమోదవుతున్నాయి..?

Malaria Disease: భారతదేశంలో మలేరియా రోగుల సంఖ్య పెరిగిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం.. దేశంలో ప్రతి సంవత్సరం 15 మిలియన్ల మలేరియా కేసులు..

Malaria Disease: మలేరియా ఎలా వ్యాపిస్తుంది..? దేశంలో ప్రతి సంవత్సరం ఎన్ని కేసులు నమోదవుతున్నాయి..?
Follow us
Subhash Goud

|

Updated on: Apr 26, 2022 | 7:11 AM

Malaria Disease: భారతదేశంలో మలేరియా రోగుల సంఖ్య పెరిగిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం.. దేశంలో ప్రతి సంవత్సరం 15 మిలియన్ల మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ఇందులో దాదాపు 19,500 నుంచి 20,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా మలేరియాతో బాధపడుతున్న వారిలో 3 శాతం మంది భారతదేశం నుండి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. నిన్న ప్రపంచ మలేరియా దినోత్సవం 2022 సందర్భంగా మలేరియా నివారణకు, ప్రాణాలను రక్షించే మార్గాల గురించి ముంబైలోని మసీనా హాస్పిటల్‌లో ఛాతీ, టీబీ వైద్యుడు సులేమాన్ లధాని TV9తో మాట్లాడారు. సాధారణంగా అన్ని వయసుల వారు మలేరియా బారిన పడుతున్నారని, అయితే గర్భిణీ స్త్రీలు, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్న పిల్లలు లేదా మరేదైనా ఇతర వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. దీని కారణంగా మలేరియా ప్రాణాంతకంగా మారుతుంది. ఆడ అలో ఫిల్లీస్ దోమ కాటు ద్వారా మలేరియా మానవులకు వ్యాపిస్తుంది. సాధారణంగా 10-14 రోజుల తర్వాత రోగిలో లక్షణాలు కనిపించడం ప్రారంభం అవుతాయని ఆయన వివరించారు.

మలేరియా పరాన్నజీవులు నాలుగు రకాలు:

మలేరియా పరాన్నజీవులు నాలుగు రకాలుగా ఉన్నాయని, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపరం, ప్లాస్మోడియం మలేరియా మరియు ప్లాస్మోడియం ఓవల్. రోగికి ఏ పరాన్నజీవి సోకింది అనే దానిపై ఆధారపడి లక్షణాలు కొద్దిగా మారవచ్చు. కానీ చాలా సందర్భాలలో లక్షణాలు అలాగే ఉంటాయి. కొన్నిసార్లు 104 డిగ్రీలకు చేరుకునే అధిక జ్వరం వంటిది. దీని తరువాత చెమట, తలనొప్పి ఉంటుంది. వాంతులు కూడా ఉంటాయంటున్నారు.

తేలికపాటి ఇన్ఫెక్షన్లలో రోగి సాధారణంగా జ్వరంతో పాటు చెమటలు వస్తాయి. కానీ ఇన్ఫెక్షన్ తీవ్రమైతే రోగి కాలేయంపై ప్రభావం చూపుతుంది. దీని కారణంగా రోగికి కామెర్లు, రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు. దీనిని అడల్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అంటారు. సరైన సమయంలో చికిత్స చేయకపోతే ప్రాణాపాయం తప్పదని వైద్యుడు లధాని తెలిపారు.

ఇవీ పిల్లల్లో వచ్చే మలేరియా లక్షణాలు

దీని లక్షణాలు పిల్లలలో కూడా ఒకేలా ఉంటాయి. అయితే లక్షణాలు ఫ్లూ లాగా కనిపిస్తాయి. 101 డిగ్రీల కంటే ఎక్కువ జ్వరం వంటి వాటిలో అతిసారం, వికారం, చిరాకు, అధికంగా నిద్రపోవడం వంటివి ఉంటాయి. దీని ప్రభావం మెదడుపై పడితే పిల్లల్లో మూర్ఛలు కూడా వస్తాయని ఆయన వివరించారు. సకాలంలో సరైన వైద్యం అందకపోవడం వల్ల రోగి ప్రాణం కూడా పోతుంది.

సెరిబ్రల్ మలేరియా అంటే ఏమిటి?

ఇది పిల్లలు, పెద్దలలో మలేరియాకు అత్యంత సాధారణ కారణం అయిన ప్లాస్మోడియం ఫాల్సిపరమ్ అనే పరాన్నజీవి వల్ల వస్తుంది. పిల్లలలో ఇది అత్యంత తీవ్రమైన నాడీ సంబంధిత పరిస్థితి. ఇది అత్యంత తీవ్రమైన పరిస్థితిగా పరిగణించబడుతుంది. ఇటువంటి లక్షణాలలో ప్రధానంగా జ్వరం, మూర్ఛలు లేదా మార్పిడి, జ్ఞాపకశక్తి ఆటంకాలు, చిరాకు వంటివి ఉంటాయి. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న ఐదేళ్లలోపు పిల్లల్లో సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాంతకం కావచ్చు.

కోవిడ్-19 ప్రభావం

కోవిడ్ 19, మలేరియా ఒకదానిపై ఒకటి చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని డాక్టర్ లధాని చెప్పారు. ఒక వ్యక్తికి ఈ రెండు వ్యాధులు కలిసి ఉంటే అతని వ్యాధి చాలా క్లిష్టమైనది, ప్రాణాంతకం అవుతుంది అని గుర్తించుకోవాలి. కోవిడ్ మహమ్మారి సమయంలో మలేరియా లక్షణాలు కూడా కోవిడ్‌ లక్షణాల మాదిరిగానే ఉంటాయి. మలేరియా నివారణకు దీని వ్యాక్సిన్ చాలా ముఖ్యమని డాక్టర్ లధాని తెలిపారు. ముఖ్యంగా మలేరియా రేటు చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. మలేరియాను నివారించడానికి తీసుకున్న చర్యలతో పాటు, వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం ఒక ముఖ్యమైన పని. తద్వారా ఈ వ్యాధి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఈ టీకా తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Fatty liver : ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే, ఈ యోగా భంగిమలను ట్రై చేయండి..

Aloe Vera Side Effects: కలబంద రసాన్ని ఈ విధంగా తీసుకోవడం వల్ల హాని కలుగుతుంది.. ఈ సమస్యలు రావొచ్చు..!