AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fatty liver : ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే, ఈ యోగా భంగిమలను ట్రై చేయండి..

Fatty liver: ప్రజలు తమ తప్పుడు ఆహారం, టైమ్ తప్పి తినడం వలన అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. అనారోగ్యకరమైన జీవన శైలి కారణంగా అవస్థలు పడుతున్నారు.

Fatty liver : ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే, ఈ యోగా భంగిమలను ట్రై చేయండి..
Liver
Shiva Prajapati
|

Updated on: Apr 26, 2022 | 6:40 AM

Share

Fatty liver: ప్రజలు తమ తప్పుడు ఆహారం, టైమ్ తప్పి తినడం వలన అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. అనారోగ్యకరమైన జీవన శైలి కారణంగా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఉదర సంబంధిత సమస్యలు ప్రస్తుత కాలంలో చాలా మందిని వేదిస్తున్నాయి. కడుపు ఉబ్బరం, ఆమ్లత్వం, అజీర్తి వంటి సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అవి తీవ్రమైన వ్యాధులకు కూడా దారితీస్తాయి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడుతుంది. ఏదైనా తిన్న మలవిసర్జన చేయడం, కడుపులో నొప్పి దీని సాధారణ లక్షణం. కాలేయం శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయం. దీని ఆరోగ్యం దెబ్బ తింటే ప్రాణాంతకం అవ్వొచ్చు. అందుకే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్న వారు డాక్టర్‌ని సంప్రదించి వైద్యం పొందవచ్చు, అయితే కొన్ని హోం రెమెడీస్‌ని అనుసరించడం ద్వారా కూడా ఉపశమనం పొందవచ్చు. యోగా ద్వారా ఫ్యాటీ లివర్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు. మరి ఫ్యాటీ లివర్, ఉదర సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు ఏ యోగాసనాలు ప్రయోజనకరమో ఇప్పుడు తెలుసుకుందాం..

పశ్చిమోత్తనాసనం.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ యోగా ఆసనం కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా కిడ్నీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ ఆసనం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా, వెన్నెముక, భుజాలు, స్నాయువులకు ఇది మంచి భంగిమ అని చెప్పొచ్చు. ఇది దిగువ వీపును వదులు చేస్తుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలసటను తగ్గిస్తుంది. తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం పొందుతుంది.

భుంజగాసన.. కడుపులో అదనపు కొవ్వు పేరుకుపోవడం వల్ల కాలేయం ఆరోగ్యం పాడవుతుంది. పొట్ట కొవ్వు తగ్గించి ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ భుంజగాసనం చేయండి. భుజంగాసనం చేయడం వల్ల పొత్తికడుపులోని కొవ్వు తగ్గుతుంది. అలాగే పొత్తికడుపు కండరాలు, నడుము, చేతులకు బలం చేకూరుతుంది. ఇది మీ శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతుంది. ఉదయాన్నే ఇలా చేయడం వల్ల రోజంతా శరీరంలో శక్తి ఉంటుందని చెబుతారు.

శలభాసన.. కడుపు సమస్యలను విస్మరించడం సరికాదు. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శలభాసనం చేయవచ్చు. ఇది చేయడం ద్వారా కడుపు, కాలేయంపై పేరుకుపోయే కొవ్వు కరిగిపోతుంది.

Also read:

Shah Rukh Khan: సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ‘షారుఖ్ ఖాన్’ ఇల్లు.. ఎందుకో తెలుసా?..

TS Police Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. పోలీసు నియామకాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

Puzzle Picture: ఫసక్.. ఇంత సింపుల్‌ ఫజిల్‌ను కూడా ఛేజ్ చేయలేకపోతున్నారు.. మీవల్ల అయితే ట్రై చేయండి..!