Woman Health: ప్రతి మహిళకి 5 వైద్య పరీక్షలు తప్పనిసరి.. లేదంటే ఈ అనారోగ్య సమస్యలు..!

Woman Health: మహిళలు తరచుగా శారీరక సమస్యలను విస్మరిస్తారు. సమస్య పెరిగే వరకు ఆరోగ్యంపై అవగాహన ఉండదు. అయితే ప్రతి మహిళ చేయవలసిన

Woman Health: ప్రతి మహిళకి 5 వైద్య పరీక్షలు తప్పనిసరి.. లేదంటే ఈ అనారోగ్య సమస్యలు..!
Woman Health
Follow us
uppula Raju

|

Updated on: Apr 29, 2022 | 11:29 AM

Woman Health: మహిళలు తరచుగా శారీరక సమస్యలను విస్మరిస్తారు. సమస్య పెరిగే వరకు ఆరోగ్యంపై అవగాహన ఉండదు. అయితే ప్రతి మహిళ చేయవలసిన మొదటి పని ఏంటంటే తన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం. వయసు పెరిగే కొద్దీ మహిళల శరీరంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. దీంతో చాలా బలహీనంగా తయారవుతారు. ఈ పరిస్థితిలో మహిళలు కొంత సమయం కేటాయించి కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించే ప్రమాదం పెరుగుతుంది. మహిళలు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలో తెలుసుకుందాం.

1. పాప్ స్మెర్ పరీక్ష

పాప్ స్మెర్ పరీక్ష అనేది గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తించడానికి ఉపయోగించే స్క్రీనింగ్ ప్రక్రియ. ఇది ప్రధానంగా గర్భాశయంలో క్యాన్సర్ లేదా ప్రీ-క్యాన్సర్ కణాలని గుర్తించడానికి చేస్తారు. తరచుగా అనారోగ్యానికి గురయ్యే మహిళలు ఈ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి.

2. మామోగ్రామ్

మామోగ్రామ్ అనేది ఎక్స్-రే. దీనిద్వారా మహిళల బ్రెస్ట్‌ని పరీక్షిస్తారు. ఈ పరీక్ష ద్వారా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తారు. మహిళలకి ఏదైనా అనుమానం ఉంటే వెంటనే ఈ పరీక్ష చేయించుకోవాలి.

3. థైరాయిడ్ పరీక్ష

ప్రతి మహిళ థైరాయిడ్ ఫంక్షన్ పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షలో శరీరంలోని థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేస్తుందో లేదో తెలుస్తుంది. శక్తి ఉత్పత్తి, జీవక్రియ వంటి అనేక ప్రక్రియలు శరీరంలో జరుగుతాయి.

4. లిపిడ్ ప్యానెల్ పరీక్ష

గుండె జబ్బుల ప్రమాదాన్ని గుర్తించడానికి లిపిడ్ ప్యానెల్ పరీక్ష చేస్తారు. ఈ పరీక్ష ద్వారా రక్తంలో 4 రకాల లిపిడ్ల స్థాయిని కొలుస్తారు.

5. రక్తపోటు పరీక్ష

ప్రతి మహిళ రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలి. బలహీనత, తల తిరగడం, నెర్వస్‌నెస్‌ ఉంటే ఈ పరీక్ష చేయించుకోవాలి. బీపీ అనేది చాలా ప్రమాదకరమైన సమస్య. దీనివల్ల ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

IPL 2022 Orange Cap: టాప్‌ 5 లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్‌ అయ్యర్.. బట్లర్‌కి ఇక పోటీ తప్పదు..!

Post Office Customers: పోస్టాఫీసు ఖాతాదారులకి బంపర్ ఆఫర్.. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఈ పథకంలో చేరవచ్చు..!

IPL 2022: ఒకసారి జరిమానా విధించినా.. మళ్లీ నో బాల్‌ విషయంలో అంపైర్‌తో గొడవ..!