IPL 2022 Orange Cap: టాప్‌ 5 లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్‌ అయ్యర్.. బట్లర్‌కి ఇక పోటీ తప్పదు..!

IPL 2022 Orange Cap: ఐపీఎల్ అంటే థ్రిల్. ప్రతి మ్యాచ్‌లోనూ బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌ల మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుంది. మ్యాచ్‌లు చూస్తున్న అభిమానులు టీవీ

IPL 2022 Orange Cap: టాప్‌ 5 లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్‌ అయ్యర్.. బట్లర్‌కి ఇక పోటీ తప్పదు..!
Shreyas Iyer
Follow us
uppula Raju

|

Updated on: Apr 29, 2022 | 11:25 AM

IPL 2022 Orange Cap: ఐపీఎల్ అంటే థ్రిల్. ప్రతి మ్యాచ్‌లోనూ బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌ల మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుంది. మ్యాచ్‌లు చూస్తున్న అభిమానులు టీవీ ముందు నుంచి కదలకుండా చూస్తారు. ఐపీఎల్‌లో టాప్‌ ఫోర్‌లో నిలవాలనే పోటీ అన్ని జట్ల మధ్య కొనసాగుతోంది. అదే సమయంలో బౌలర్లు పర్పుల్ క్యాప్‌పై, బ్యాట్స్‌మెన్ ఆరెంజ్ క్యాప్‌పై దృష్టి సారిస్తున్నారు. ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ జోస్ బట్లర్ పరుగుల వరద సృష్టిస్తున్నాడు. ఇప్పుడు అతడికి పోటీగా KKR కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ రంగంలోకి దిగాడు. సడెన్‌గా టాప్‌ 5లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఆరెంజ్ క్యాప్ అనేది ప్రతి ఐపీఎల్ బ్యాట్స్‌మెన్ కల. లీగ్ ముగిసే సమయానికి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఈ క్యాప్ దక్కుతుంది. అదే సమయంలో లీగ్‌లోని ప్రతి మ్యాచ్ తర్వాత జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఆటగాడి తలపై ఆరెంజ్ క్యాప్‌ ఉంటుంది. ఈ సీజన్‌లో చాలా మ్యాచ్‌లు ఈ క్యాప్ జోస్ బట్లర్‌పైనే ఉంది. అయితే ఇప్పుడు కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా టాప్ 5లో చేరాడు. దీంతో బట్లర్‌కి పోటీని పెంచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఈ సీజన్‌లో బ్యాడ్‌ఫార్మ్‌లో ఉంది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతడిని మొదటి ఐదు స్థానాల్లోకి తీసుకెళ్లడానికి ఇది సరిపోతుంది. అయ్యర్ 37 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతని బ్యాట్‌ నుంచి కేవలం నాలుగు ఫోర్లు మాత్రమే వచ్చాయి. అయ్యర్ ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 290 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్‌ రేసులో మొదటి ఐదుగురు ఆటగాళ్లు వేర్వేరు జట్లకు చెందినవారు ఉన్నారు.

ఆరెంజ్ క్యాప్ రేస్ పరిస్థితి ఏమిటి?

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ జోస్ బట్లర్ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 499 పరుగులు చేశాడు. బట్లర్ ఖాతాలో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతను 71.29 సగటుతో పరుగులు చేస్తున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రెండో స్థానంలో ఉన్నాడు. రాహుల్ ఎనిమిది మ్యాచ్‌ల్లో 368 పరుగులు చేయడంతోపాటు రెండుసార్లు సెంచరీ కూడా చేశాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఏడు మ్యాచ్ ల్లో 305 పరుగులు చేసి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. పంజాబ్ కింగ్స్‌కు చెందిన శిఖర్ ధావన్ 302 పరుగులు చేసి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Post Office Customers: పోస్టాఫీసు ఖాతాదారులకి బంపర్ ఆఫర్.. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఈ పథకంలో చేరవచ్చు..!

IPL 2022: ఒకసారి జరిమానా విధించినా.. మళ్లీ నో బాల్‌ విషయంలో అంపైర్‌తో గొడవ..!

Car Mileage: మీ కారు మైలేజీ ఇవ్వడం లేదా.. ఒక్కసారి వీటిని పాటించి చూడండి..!