Viral Video: ఈ వ్యక్తి క్రియేటివిటీ మాములుగా లేదుగా.. చూస్తే ఇంజనీర్లు సైతం నోరెళ్లబెడతారు!
ఇంటర్నెట్ వినియోగం పెరిగినప్పటి నుంచి ఎంతోమంది వ్యక్తులలో దాగి ఉన్న ప్రతిభ.. కొత్త కొత్త ఇన్వెన్షన్ల రూపంలో బయటపడుతోంది...
ఇంటర్నెట్ వినియోగం పెరిగినప్పటి నుంచి ఎంతోమంది వ్యక్తులలో దాగి ఉన్న ప్రతిభ.. కొత్త కొత్త ఇన్వెన్షన్ల రూపంలో బయటపడుతోంది. తమకు అందుబాటులో దొరికే చిన్న చిన్న వస్తువులతోనే ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపోయేలా సరికొత్త వెహికిల్స్‌ను సిద్దం చేస్తున్నారు. ఈ కోవలోనే ఓ వ్యక్తి చేసిన వాహనం ప్రస్తుతం నెటిజన్లను ఫిదా చేస్తోంది. అసలు ఆ వ్యక్తి ఈ బండిని ఎలా చేశాడో తెలియదు గానీ.. అతడి తెలివికి మాత్రం అందరూ సాహో అంటున్నారు.
వైరల్ వీడియో ప్రకారం.. ఎఫ్ 1 రేస్‌లో ఉపయోగించే కారు లాంటి వెహికిల్‌లో ఓ వ్యక్తి నల్ల జాకెట్, హెల్మెట్ పెట్టుకుని పాలను సరఫరా చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. అతగాడు ఎఫ్ 1 కారు రేసర్ అవ్వాలనుకున్నాడో.. లేక తనలోని ప్రతిభను వెలికి తీయాలనుకున్నాడో తెలియదు గానీ.. ఆ వాహనాన్ని చూసి ఇంజనీర్లు అసూయ పడేలా చేశాడు. తన దగ్గర ఉండే వస్తువులతో అతడి తెలివికి పదునుపెట్టి సరికొత్త ఇన్వెన్షన్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా, ఈ ఫన్నీ వీడియోను RoadsOfMumbai అనే ట్విట్టర్ పేజీ సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసింది. ‘మీరు ఫార్ములా వన్ డ్రైవర్ కావాలనుకున్నప్పుడు.. కుటుంబం ఒత్తిడితో పాల వ్యాపారంలో సహాయపడితే’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఇప్పటిదాకా ఈ వీడియోకు లక్షా 30 వేలకు పైగా వ్యూస్ రాగా.. 3 వేల వరకు లైకులు వచ్చాయి. లేట్ ఎందుకు మీరూ ఓసారి వీడియోపై లుక్కేయండి..
When you want to become a F1 driver, but the family insists in helping the dairy business ?? pic.twitter.com/7xVQRvGKVb
— Roads of Mumbai ?? (@RoadsOfMumbai) April 28, 2022
Where there’s a will there’s a way!!!kudos to this guy ???
— Revathi Krishnan (@revathishyamk) April 28, 2022
This is really cool!
— Pranam_Pitaji (@pranam_pitaji) April 28, 2022
No doubt he is talented.
— R R S (@ACommon61990278) April 28, 2022