ఇండిగో విమానాల రద్దు కారణంగా కర్ణాటకకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల జంట తమ పెళ్లి రిసెప్షన్‌కు నేరుగా హాజరు కాలేకపోయింది. గందరగోళ పరిస్థితుల్లో ఆ కొత్త జంట తమ అతిథుల కోసం వర్చువల్‌గా రిసెప్షన్లో పాల్గొని, వారి ఆశీస్సులు అందుకుంది. ఈ సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.