బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇండిగో విమాన అంతరాయాలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ, ఒక తండ్రి ఆవేదన వీడియో వైరల్ అయింది. రక్తస్రావంతో బాధపడుతున్న తన కుమార్తె కోసం శానిటరీ ప్యాడ్ అడిగినా ఎయిర్పోర్ట్ సిబ్బంది నిరాకరించడంతో, ఆ తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటన ప్రయాణికుల కష్టాలను వెలుగులోకి తెచ్చింది.