Prabhas: ప్రభాస్ నా ఇంటర్ ఫ్రెండ్! MLA ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు కలిసి చదువుకున్న అరుదైన స్నేహబంధాలపై ఈ కథనం. రామ్ చరణ్-రానా, మహేష్ బాబు-విజయ్ వంటి స్టార్ల కాలేజీ రోజులను గుర్తు చేస్తుంది. ముఖ్యంగా, ప్రభాస్, బొజ్జల సుధీర్ ఇంటర్ క్లాస్‌మేట్స్ ఎలా అయ్యారు, ప్రభాస్ వ్యక్తిత్వం గురించి సుధీర్ చెప్పిన ఆసక్తికర విషయాలు, వైరల్ అవుతున్న వీడియో విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.
టాలీవుడ్ లో చాలా మంది హీరోలు కలిసి చదువుకున్నారు. వీరిలో ఇప్పటికీ చాలా మంది తమ ఫ్రెండ్ షిప్ ను కంటిన్యూ చేస్తున్నారు. రామ్ చరణ్ – రానా దగ్గుబాటి – శర్వానంద్, మహేష్ బాబు – దళపతి విజయ్, జూనియర్ ఎన్టీఆర్ – మంచు మనోజ్, నాని- యాంకర్ ప్రదీప్.. ఇలా చాలా మంది సెలబ్రిటీలు ఒకే స్కూల్ లేదా కాలేజీలో చదువుకున్నారు. వీరితో పాటు ఒకే స్కూల్ లో చదివిన సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి- అక్కినేని సుమంత్, బాలకృష్ణ – కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు ఇంకా చాలా మంది కలసి సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ యువ నేత, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి చదువుకున్నారట. ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఎక్కడ చూసినా అదే కనిపిస్తోంది. ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే…! “ప్రభాస్ నా క్లాస్ మేట్. అలాగే యువీ క్రియేషన్స్ అధినేత నిర్మాత వంశీ కూడా మా క్లాస్మేట్. హైదరాబాద్ నలందలో మేం ఇంటర్ కలిసే చదువుకున్నాం. నేను మొదట బైపీసీ జాయిన్ అయి మళ్లీ సీయిసీ లోకి వెళ్లాను. అక్కడ ప్రభాస్ కూడా సీయిసీ. అలా ప్రభాస్ తో నా పరిచయం మొదలైంది. ఇప్పుడు ఆయన నేషనల్ కటౌట్. ప్రభాస్ ఎక్కువగా ఎవర్ని కలవడు. ఆయనకు చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు. చాలా చిన్న సర్కిల్ లో ఉంటాడు. పెద్ద మనసు, మంచి వ్యక్తి. మేం ఫ్రెండ్స్ ఓ రోజు గెస్ట్ హౌస్ లో కూర్చున్నాం. ప్రభాస్ చాలా రకాల ఫుడ్స్ తెప్పించాడు. వాళ్లింట్లో చిల్లి చికెన్ ఫ్రైడ్ రైస్ బాగా చేస్తారు. ఆయన మాత్రం కొంచెమే తింటాడు, మాకు మాత్రం చాలా పెడతాడు. చాలా లవ్లీ పర్సనాలిటీ ఆయన. త్వరలో రిలీజవ్వబోయే ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అంటూ ఆకాంక్షించారు బొజ్జల. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Indraja: ప్రేమలో మోసపోయారా ?? శాపాలు పెడుతూ ఇంద్రజ ఎమోషనల్!
Bigg Boss Kalyan: చరిత్ర సృష్టించిన ఆర్మీ మ్యాన్! హౌస్‌లో అందరికీ బిగ్ షాక్
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

