సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
కరీంనగర్ జిల్లా వెన్నంపల్లిలో కోతుల బెడద తీవ్రం. సర్పంచ్ అభ్యర్థి చిరంజీవి ఎన్నికల ప్రచారంలో భాగంగా కోతుల సమస్యను పరిష్కరించడానికి పూనుకున్నాడు. నిపుణులను రప్పించి బోన్లతో కోతులను పట్టి, అటవీ ప్రాంతంలో వదిలేస్తున్నాడు. ఎన్నికలకు ముందే ఈ చర్య తీసుకోవడం వల్ల ఓటర్లను బాగా ఆకర్షిస్తున్నాడు. ఇది ఇతర అభ్యర్థుల ప్రచారానికి భిన్నంగా నిలుస్తోంది.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం కోతులు చుట్టూ తిరుగుతుంది. ఈ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలు నేపథ్యంలో ఆ గ్రామ సర్పంచ్ అభ్యర్థి చిరంజీవి.. కోతుల ను గ్రామం నుంచి వెళ్లగొట్టిస్తానని హామీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే కోతులను వెళ్లగొట్టే పనిలో పడ్డాడు చిరంజీవి. స్థానిక సర్పంచ్ అభ్యర్ధి చిరంజీవి ఎన్నికల ప్రచారం లో భాగంగా.. కోతుల సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. కేవలం హామీ ఇవ్వడమే కాకుండా మాట మీద నిలబడి ఆచరణలో చూపించేందుకు సిద్ధమయ్యాడు. కోతులను పట్టుకోవడంలో నిపుణులైన వారిని ప్రత్యేకంగా గ్రామానికి రప్పించారు. వారు గ్రామంలోని కోతులను పట్టుకోడానికి బోన్లు ఏర్పాటు చేశౄరు. బోన్లలో కోతులకు ఆహారం ఎరగా వేసి వాటిని బంధిస్తున్నారు. అనంతరం వాటిని తీసుకెళ్లి దూరంగా అటవీప్రాంతంలో వదిలిపెడుతున్నారు. సర్పంచ్ బరిలో ఉన్న ఇతర అభ్యర్ధులు ఇంకా ప్రచారంలో మునిగి ఉండగా.. చిరంజీవి మాత్రం ఎన్నికలకు ముందే గెలుపు ఓటమితో సంబంధం లేకుండా కోతుల సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టడంతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మకానికి ఆర్సీబీ.. రేసులో అమెరికన్ బిలియనీర్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

