Kiwi Fruit: కివీ పండులో పోషకాలు పుష్కలం.. ఇలా ట్రై చేయండి..!

Kiwi Fruit: కివీ పండులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే వైద్య నిపుణులు ఆరోగ్యంగా ఉండటానికి తరచుగా కివిని తినమని సూచిస్తారు. డెంగ్యూ, చికున్‌గున్యా

Kiwi Fruit: కివీ పండులో పోషకాలు పుష్కలం.. ఇలా ట్రై చేయండి..!
Kiwi Fruit
Follow us
uppula Raju

|

Updated on: Apr 29, 2022 | 1:51 PM

Kiwi Fruit: కివీ పండులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే వైద్య నిపుణులు ఆరోగ్యంగా ఉండటానికి తరచుగా కివిని తినమని సూచిస్తారు. డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధుల్లో ప్లేట్‌లెట్‌ కౌంట్‌ పడిపోతుంది. ఆ సమయంలో కివీ తీసుకుంటే ప్లేట్‌లెట్స్‌ సులభంగా పెరుగుతాయి. డీహైడ్రేషన్, పొడి చర్మం ఉన్నవారు కివీని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో అసలైన పొటాషియం లభిస్తుంది. ఇది శారీరక బలహీనతను తొలగిస్తుంది. మీరు కివీ తినలేకపోతే దాంతో కొన్ని రుచికరమైన వంటకాలను తయారు చేసుకోవచ్చు. కివిని రసం, సలాడ్ రూపంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో ఐస్ క్రీం, కేకులు తయారుచేయవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

కివి జ్యూస్‌

కివీ జ్యూస్ ఒక్క క్షణంలో రెడీ అవుతుంది. కివీ జ్యూస్ రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మీ శరీరాన్ని చల్లబరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

కివి కేక్

మీరు మీ ఇంట్లోనే కివీతో రుచికరమైన కేక్‌ని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది మీకు ఆరోగ్యాన్ని అందింస్తుంది. అంతేగాక తీపి తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది.

ఎనర్జీ డ్రింక్‌

నిమ్మకాయ, పుదీనా, కివీని కలపడం ద్వారా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఎనర్జీ డ్రింక్‌ని సులభంగా తయారు చేసుకోవచ్చు. వేసవి కాలంలో ఈ ఎనర్జీ డ్రింక్ చాలా ఆరోగ్యకరమైనది.

కివి సల్సా

ఇంట్లో మీరు అవకాడో, కివీ పండు, ఉప్పు, మిరియాలు కలపడం ద్వారా రుచికరమైన సల్సాను తయారు చేయవచ్చు. ఇది రుచిని పెంపొందించడమే కాకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

కివి స్మూతీ

ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అల్పాహారం కోసం ఇది గొప్ప ఎంపిక అవుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు తీసుకోవచ్చు.

కివి మిల్క్ షేక్

మీరు పాలతో కివీ మిల్క్‌షేక్‌ను తయారు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో డ్రైఫ్రూట్‌లను కలపడం ద్వారా చాలా టేస్టీగా ఉంటుంది.

కివి పాన్‌కేక్‌

మీరు కివీ పాన్‌కేక్‌ అల్పాహారంగా తీసుకోవచ్చు. రుచిని పెంచడానికి దీనికి తేనె కలుపుకోవచ్చు.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Hanuman Chalisa: ఎంపీ నవనీత్‌ రాణా దంపతులకి దక్కని బెయిల్.. విచారణ రేపటికి వాయిదా..

Viral Video: చిరుతపులి చెట్టు దిగే పద్దతి చూసి షాక్‌ అవుతున్న నెటిజన్లు..!

Viral Video: సోదరి అత్తారింటికి వెళుతుంటే సోదరుడి భావోద్వేగం.. నెటిజన్ల హృదయాలని గెలిచిన వీడియో..!