AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సోదరి అత్తారింటికి వెళుతుంటే సోదరుడి భావోద్వేగం.. నెటిజన్ల హృదయాలని గెలిచిన వీడియో..!

Viral Video: అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల బంధం ప్రత్యేకమైనది. ఇంట్లో ఉన్నప్పుడు ఒకరికొకరు పోట్లాడుకున్నా ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ, అనుబంధం, ఉంటుంది.

Viral Video: సోదరి అత్తారింటికి వెళుతుంటే సోదరుడి భావోద్వేగం.. నెటిజన్ల హృదయాలని గెలిచిన వీడియో..!
Brides Brother Crying
uppula Raju
|

Updated on: Apr 29, 2022 | 12:41 PM

Share

Viral Video: అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల బంధం ప్రత్యేకమైనది. ఇంట్లో ఉన్నప్పుడు ఒకరికొకరు పోట్లాడుకున్నా ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ, అనుబంధం, ఉంటుంది. ఎవరికి కష్టం వచ్చినా మేమున్నామంటు ముందుంటారు. అలాగే ఒకరికొకరు దూరమవుతున్నారని తెలిసినప్పుడు చాలా భావోద్వేగానికి గురవుతారు. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి తోబుట్టువుల పెళ్లిళ్ల సమయంలో జరుగుతుంది. చెల్లెలు కానీ అక్క కానీ అత్తారింటికి వెళ్లే సమయంలో సోదరులు చాలా భావోద్వేగానికి లోనవుతారు. కన్నీళ్లను దాచలేరు. తాజాగా ఓ సోదరి అత్తారింటికి వెళ్లే సమయంలో సోదరుడు పడే బాధ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఎమోషనల్‌ వీడియోని నెటిజన్లు బాగా ఆదరిస్తున్నారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో సోదరి వివాహ సమయంలో వీడ్కోలు సమయం వచ్చేసింది. ఇంతలో సోదరిని చూసి సోదరుడు భావోద్వేగాన్ని ఆపుకోలేకపోతాడు. కళ్లలో వెంటనే నీళ్లు తిరుగుతాయి. కానీ సోదరి ఏడవకుండా అలాగే ఉంటుంది. వెంటనే సోదరుడు కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకుంటాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎమోషనల్‌ వీడియో అంటు కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి పెళ్లి సమయంలో ఏ అమ్మాయికైనా భావోద్వేగం ఉంటుంది. ఎందుకంటే పుట్టి పెరిగిన ఇంటిని విడిచి వెళ్లడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. అలాగే సోదరి వెళ్లిపోతుంటే ఏ సోదరుడికైనా బాధగానే ఉంటుంది.

కొన్ని గంటల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 14 వందల మందికి పైగా లైక్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అంతేకాదు చాలామంది నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తు్న్నారు. ఓవరాల్ గా ఈ వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్‌ తెలియజేయండి.

Woman Health: ప్రతి మహిళకి 5 వైద్య పరీక్షలు తప్పనిసరి.. లేదంటే ఈ అనారోగ్య సమస్యలు..!

IPL 2022 Orange Cap: టాప్‌ 5 లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్‌ అయ్యర్.. బట్లర్‌కి ఇక పోటీ తప్పదు..!

Post Office: పోస్టాఫీసు ఖాతాదారులకి బంపర్ ఆఫర్.. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఈ పథకంలో చేరవచ్చు..!

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి