Viral Video: చిరుతపులి చెట్టు దిగే పద్దతి చూసి షాక్‌ అవుతున్న నెటిజన్లు..!

Viral Video: సోషల్‌మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో జంతువులకి సంబంధించిన వీడియోలని నెటిజన్లు బాగా చూస్తారు.

Viral Video: చిరుతపులి చెట్టు దిగే పద్దతి చూసి షాక్‌ అవుతున్న నెటిజన్లు..!
Leopard
Follow us
uppula Raju

|

Updated on: Apr 29, 2022 | 12:45 PM

Viral Video: సోషల్‌మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో జంతువులకి సంబంధించిన వీడియోలని నెటిజన్లు బాగా చూస్తారు. షేర్స్, కామెంట్స్‌ చేస్తూ హోరెత్తిస్తారు. సాధారణంగా ఇలాంటి వీడియోలకి ఆదరణ ఎక్కువగా ఉంటుంది. తాజాగా చిరుతపులికి సంబంధించిన ఒక వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. సాధారణంగా చిరుత వేటాడే జంతువు. ఏ మాత్రం అవకాశం దొరికినా వదిలిపెట్టదు. ఎరని పట్టుకోవడంలో చాలా టెక్నిక్స్‌ ఉపయోగిస్తుంది. వేటాడే జంతువులలో ఇది చాలా తెలివైన జంతువు. ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈ షాకింగ్ వీడియో ఒక గ్రామంలా జరిగింది. చుట్టు చెరకు పంట ఉంటుంది. ఈ ప్రాంతం నివాసాలకు సమీపంలో ఉందని అర్థమవుతుంది. ఈ క్లిప్‌లో చిరుతపులి వేట కోసం చెట్టుపైకి మాటువేసి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చాలాసేపు వేచిచూసి ఏది కనిపించకపోయేసరికి కిందికి దిగుతుంది. అయితే అది చెట్టుదిగే పద్దతి చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సాధారణంగా ఒక మనిషి ఏ విధంగానైతే చెట్టు దిగుతాడో చిరుత కూడా అలాగే దిగుతుంది. చిరుతపులి చెట్లు ఎక్కడంలో చాలా ఎక్సపర్ట్‌ అని చెప్పవచ్చు. మిగతా వేటాడే జంతువులకి దీనికి తేడా ఇదే. అందుకే దీని కంటపడితే ఏ జంతువైనా ఆహారం కావాల్సిందే.

ఈ వీడియోని ఐఎఫ్ఎస్ రమేష్ పాండే తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఈ వార్త రాసే వరకు ఈ వీడియోకి వేలల్లో వ్యూస్‌ వచ్చాయి. వీడియో చూసిన తర్వాత జనాలు ఆశ్చర్యపోతున్నారు. అయితే ప్రజలు, వీధి కుక్కల కారణంగా చిరుతపులి చెట్టుపైకి ఎక్కి ఉంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తు్న్నారు. మీరు ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్ తెలియజేయండి.

మరిన్ని వైరల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Viral Video: సోదరి అత్తారింటికి వెళుతుంటే సోదరుడి భావోద్వేగం.. నెటిజన్ల హృదయాలని గెలిచిన వీడియో..!

Woman Health: ప్రతి మహిళకి 5 వైద్య పరీక్షలు తప్పనిసరి.. లేదంటే ఈ అనారోగ్య సమస్యలు..!

IPL 2022 Orange Cap: టాప్‌ 5 లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్‌ అయ్యర్.. బట్లర్‌కి ఇక పోటీ తప్పదు..!