మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో స్థానికులకు అరుదైన దృశ్యం కంటపడింది. పవర్ ప్లాంట్ వద్ద రోడ్డుపై రెండు పులి పిల్లలు ఆడుకుంటూ కనిపించాయి. సమీపంలోని తడోబా అభయారణ్యం నుంచి వచ్చిన ఈ పులి పిల్లలను వాకర్స్ తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఈ వైరల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.