గుజరాత్లోని అమ్ధా గ్రామంలో స్నేక్ క్యాచర్ ముఖేష్ బయాద్ సాహసం చేశాడు. విద్యుత్ షాక్తో అపస్మారక స్థితిలో ఉన్న పాముకు నోటితో సీపీఆర్ చేసి ప్రాణం పోశాడు. 25 నిమిషాల పాటు శ్రమించి పామును బతికించాడు. ఈ దృశ్యాలు వైరల్ కావడంతో నెటిజన్లు అతడి తెగువను మెచ్చుకుంటున్నారు. ఇది అరుదైన ఘటన.