Healthy Oats: త్వరగా బరువు తగ్గాలని భావిస్తున్నారా?.. ఓట్స్‌ని ఈ 4 విధాల్లో తీసుకోండి..

Healthy Oats: ఓట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఓట్స్‌ని ఆర్యోగకరమైనదిగా పేర్కొంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఓట్స్ తినేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

Healthy Oats: త్వరగా బరువు తగ్గాలని భావిస్తున్నారా?.. ఓట్స్‌ని ఈ 4 విధాల్లో తీసుకోండి..
Oats
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 29, 2022 | 8:01 PM

Healthy Oats: ఓట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఓట్స్‌ని ఆర్యోగకరమైనదిగా పేర్కొంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఓట్స్ తినేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్‌ను ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతారు. ఓట్స్‌లో పిండి పదార్థాలు, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది బరువు తగ్గడానికి ఉపయోగకరంగా ఉంటుంది.. మీరు బరువు తగ్గాలని భావిస్తున్నట్లయితే.. మీ ఆహారంలో ఓట్స్ చేర్చుకోవాల్సిందే. అయితే, ప్యాక్డ్, ఫ్లేవర్డ్ ఓట్స్ తీసుకుంటే బరువు తగ్గకపోగా.. పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే బరువు తగ్గాలనుకుంటే మాత్రం సాధారణ ఓట్స్ మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, బరువు తగ్గాలనుకునే వారు ఓట్స్‌ని ఈ నాలుగు విధాలుగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మరి ఆ నాలుగు విధాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. స్నాక్స్‌ లో ఓట్స్ తీసుకోవచ్చు.. బరువు తగ్గడానికి అల్పాహారంతో పాటు స్నాక్స్‌లో ఓట్స్ తినవచ్చు. చిరుతిళ్ల కంటే ఓట్స్ తింటే ఆకలి తగ్గుతుంది. దీని వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది. ఆహారంలో వోట్స్ చివ్డాను తీసుకోవచ్చు. ఇంకా దీనికి డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి తినడం ద్వారా కూడా మంచి ప్రయోజనం ఉంటుంది.

2. ఆరోగ్యకరమైన స్వీట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునే వారు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. అయితే, సహజసిద్ధమైన చక్కెర పదార్థాలను తీసుకోవచ్చు. కానీ, ఓట్స్‌ను చక్కెరతో కలిపి తినొద్దు. స్వీట్స్ ఓట్స్ తినాలనిపిస్తే బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీస్, డ్రైఫ్రూట్స్ కలిపి తినొచ్చు.

3. వోట్స్ – వాటర్.. ఓట్స్‌ను పాలలో కలిపి తినడానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ బరువు తగ్గాలనుకుంటే మాత్రం పాలకు బదులుగా నీటిని వాడితే ప్రయోజనం ఉంటుంది. నీటిలో ఓట్స్‌ని ఉడికించి తీసుకోవచ్చు.

4. ఓట్స్ ఉప్మా.. ఓట్స్‌ను ఉప్మా రూపంలో కూడా ఉపయోగించవచ్చు. రవ్వ ఉప్మా కంటే ఓట్స్ ఉప్మా చాలా ఆరోగ్యకరమైనది. అలాగే దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందులో అనేక రకాల కూరగాయలను కూడా కలిపి తినవచ్చు. దీంతో ఓట్స్‌లో పోషక విలువలు పెరుగుతాయి. అలాగే, మరింత ప్రోటీన్, ఫైబర్ పొందుతారు.

Also read:

Viral Video: ఆడ పులి కోసం రెండు పులుల మధ్య భీకర పోరు.. వీడియో చూస్తే గుండెలదరాల్సిందే..!

Health Tips: ఉదయం లేవగానే భుజాలు బిగుసుకుపోతున్నాయా? ఈ సమస్యకు ఈజీగా చెక్ పెట్టండి..!

Bjp vs Trs: ప్రభుత్వ కార్యక్రమమా? పార్టీ కార్యక్రమమా?.. బీజేపీ నేతలపై ఫైర్ అయిన మంత్రి ప్రశాంత్ రెడ్డి..