Bjp vs Trs: ప్రభుత్వ కార్యక్రమమా? పార్టీ కార్యక్రమమా?.. బీజేపీ నేతలపై ఫైర్ అయిన మంత్రి ప్రశాంత్ రెడ్డి..
Nitin Gadkari: తెలంగాణలో రెండు జాతీయ రహదారులను జాతికి అంకితం చేసే ప్రభుత్వ కార్యక్రమాన్ని బీజేపీ తన సొంత పార్టీ కార్యక్రమంలా చేసిందంటూ రాష్ట్ర మంత్రి వేముల..
Bjp vs Trs: తెలంగాణలో రెండు జాతీయ రహదారులను జాతికి అంకితం చేసే ప్రభుత్వ కార్యక్రమాన్ని బీజేపీ తన సొంత పార్టీ కార్యక్రమంలా చేసిందంటూ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ నేతల తీరు జుగుస్సాకరంగా అనిపించిందన్నారు. అక్కడ బీజేపీ కార్యకర్తలు, జెండాలు చూసి ముందుగానే వెళ్లిపోదామని అనుకున్నానని చెప్పారు మంత్రి వేముల. అయితే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై గౌరవంతో సమావేశంలో పాల్గొన్నానని చెప్పారు. అధికారిక కార్యక్రమానికి బీజేపీ జెండాలు, కండువాలు పట్టుకుని పెద్ద ఎత్తున కార్యకర్తలు ఎందుకు వచ్చారని మంత్రి ప్కరశాంత్ రెడ్డి ప్రశ్నించారు. తమను అవమానించాలని ముందుగానే ప్లాన్ వేసుకున్నట్లు అనిపిస్తోందన్నారు.
సభలో తాను మాట్లాడటం మొదలు పెట్టగానే.. జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారని, తనను మాట్లాడనివ్వకుండా అవమానించారని అన్నారు మంత్రి వేముల. రాష్ట్రాభివృద్ధి కోసం అవమానాన్ని దిగమింగుకుని స్పీచ్ కొనసాగించానని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సముదాయిస్తే కానీ బీజేపీ కార్యకర్తలు అదుపులోకి రాలేదన్నారు. అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్లుగానే కేంద్రం తెలంగాణకూ నిధులు ఇస్తోందని పేర్కొన్నారు. కానీ, దీన్ని తెలంగాణకు ఇస్తున్న బహుమతిగా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు మంత్రి వేములు. బీజేపీ కార్యకర్త చిల్లర పనికి నితిన్ గడ్కరీ సైతం విచారం వ్యక్తం చేశారన్నారు. దిగజారిన రాకీయాలకు ఇది నిదర్శనం అని చెప్పారు.
కాగా, తెలంగాణలో రెండు జాతీయ రహదారులను జాతికి అంకితం ఇచ్చారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. రాంసాన్‌పల్లి నుంచి మంగళూరుకు రూ. 1614 కోట్ల వ్యయంతో నిర్మించిన 47వ నెంబర్ జాతీయ రహదారితో పాటు మంగళూరు నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 49 కిలోమీటర్ల మేర రూ. 1312 కోట్లతో నిర్మించిన జాతీయ రహదారిని జాతికి అంకితం చేశారు. అలాగే మరో పది నేషనల్ హైవేస్ నిర్మాణానికి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు, గుండ్లపోచంపల్లి నుంచి బోయినపల్లి వరకు, కల్కల్లు నుంచి గుండ్లపోచంపల్లి వరకు, దుద్దేడ నుంచి జనగాం వరకు, వెలిగొండ నుంచి తొర్రూరు వరకు రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Also read:
Nikhil: మీకు కొడుకుగా ఉన్నందుకు ప్రతిక్షణం గర్వపడ్డాను.. తండ్రి మరణంపై హీరో నిఖిల్ భావోద్వేగ లేఖ..