Nikhil: మీకు కొడుకుగా ఉన్నందుకు ప్రతిక్షణం గర్వపడ్డాను.. తండ్రి మరణంపై హీరో నిఖిల్ భావోద్వేగ లేఖ..

యంగ్ హీరో నిఖిల్ (Nikhil) తండ్రి శ్యామ్ సిద్ధార్థ్ కన్నుమూయడంతో అతడి ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి. గత కొన్నేళ్లుగా అరుదైన వ్యాధితో

Nikhil: మీకు కొడుకుగా ఉన్నందుకు ప్రతిక్షణం గర్వపడ్డాను.. తండ్రి మరణంపై హీరో నిఖిల్ భావోద్వేగ లేఖ..
Nikhil
Follow us

|

Updated on: Apr 29, 2022 | 3:33 PM

యంగ్ హీరో నిఖిల్ (Nikhil) తండ్రి శ్యామ్ సిద్ధార్థ్ కన్నుమూయడంతో అతడి ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి. గత కొన్నేళ్లుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న శ్యామ్ సిద్ధార్థ్ నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణం పై ఈరోజు నిఖిల్ భావోద్వేగ పోస్ట్ చేశారు. తన తండ్రితో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ తండ్రితో కలిసిన దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు నిఖిల్. తమకు మంచి జీవితాన్ని అందించడానికి తన తండ్రి ఎంతో కష్టపడ్డారని.. తమతో గడిపేందుకు గత 8 ఏళ్ల నుంచి వ్యాధి నుంచి కోలుకునేందుకు పోరాటం చేశారన్నారు.. “నా తండ్రి మరణంతో నేను ఎంతగానో కుంగిపోయాను.. ఆయన ఎంతోమంది విద్యార్థులకు చదువునందించారు. మరెంతోమందికీ తమ కెరీర్లో మార్గనిర్దేశం చేశారు. చుట్టూ ఉన్నవాళ్లు సంతోషంగా ఉండేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుండేవారు. నన్ను ఒక నటుడిగా చూసేందుకు ఎన్నో కలలు కన్నారు.. ఆయన ఎన్టీఆర్, ఏయన్నార్ లకు వీరాభిమాని.. వాళ్లలాగే నేను ఓ పెద్ద నటుడిని కావాలనుకున్నారు.. ఆయన అందించిన మద్ధతు వల్లే ఇలా ఈరోజు మీ ముందు ఉన్నాను..

ఎలక్ర్టానిక్ ఇంజనీరింగ్ లో జేఎన్టీయూ నుంచి స్టేట్ టాపర్ గా నిలిచిన ఆయన.. ఇప్పటికీ హార్డ్ వర్క్ మాత్రమే నమ్ముకున్నారు.. మాకు మంచి జీవితాన్ని అందించేందుకు ఎంతో కష్టపడ్డారు.. ఇప్పుడు జీవితంలో విశ్రాంతి తీసుకుంటూ మాతో సంతోషంగా గడపాలనుకున్న సమయంలో మాకు దూరమయ్యారు. అరుదైన వ్యాధితో 8 ఏళ్లు పోరాటం చేస్తూనే ఉన్నారు.. కానీ అనుహ్యంగా గురువారం తుదిశ్వాస విడిచారు.. నువ్వు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నా నాన్న.. మిమ్మల్ని చాలా మిస్ అవుతాం.. క్రాస్ రోడ్లలో సినిమాలు.. బిర్యానీ కోసం బయటకు వెళ్లిన రోజులు.. లాంగ్ డ్రైవ్స్, ముంబయి ట్రిప్స్, ఇలా చాలా విషయాల్లో మిస్ అవుతాం.. మీకు కొడుకుగా ఉన్నందుకు నేను ప్రతి క్షణం గర్వపడ్డాను.. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను ” అంటూ పోస్ట్ చేశారు నిఖిల్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో కార్తికేయ 2, 18 పేజీస్, స్పై చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Acharya Movie Review: ఆచార్య అంచనాల సంచలనాలను అందుకున్నాడా.? మెగా మూవీ ఎలా ఉందంటే..

Acharya: మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాకోసం ట్రెండ్ అయిన ఐదుగురు భామలు వీరే

Tollywood : సౌత్ సినిమాలే శరణం అంటున్న బాలీవుడ్.. రీమేక్స్‌ వెంటపడుతున్న నార్త్ మేకర్స్‌

Siddhu Jonnalagadda : ఆ మలయాళ రీమేక్‌కు డీజే స్టార్ నో చెప్పారా..? కారణం ఇదేనా..?