Tollywood : సౌత్ సినిమాలే శరణం అంటున్న బాలీవుడ్.. రీమేక్స్‌ వెంటపడుతున్న నార్త్ మేకర్స్‌

సౌత్ నుంచి స్ట్రయిట్ సినిమాలే నార్త్‌లో దండయాత్ర చేస్తుంటే.. నార్త్ మేకర్స్‌ మాత్రం సౌత్ సినిమాల రీమేక్స్‌ వెంట పడుతున్నారు. బీటౌన్‌లో స్ట్రయిట్‌ సినిమాలే పెద్దగా ఆకట్టుకోని సిచ్యుయేషన్‌లో రీమేక్‌ ఫార్ములాతో సక్సెస్‌ కోసం తంటాలు పడుతున్నారు.

Tollywood : సౌత్ సినిమాలే శరణం అంటున్న బాలీవుడ్.. రీమేక్స్‌ వెంటపడుతున్న నార్త్ మేకర్స్‌
Bollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 29, 2022 | 12:18 PM

సౌత్ నుంచి స్ట్రయిట్ సినిమాలే నార్త్‌లో దండయాత్ర చేస్తుంటే.. నార్త్ మేకర్స్‌(Bollywood) మాత్రం సౌత్ సినిమాల రీమేక్స్‌ వెంట పడుతున్నారు. బీటౌన్‌లో స్ట్రయిట్‌ సినిమాలే పెద్దగా ఆకట్టుకోని సిచ్యుయేషన్‌లో రీమేక్‌ ఫార్ములాతో సక్సెస్‌ కోసం తంటాలు పడుతున్నారు. మరి ఈ సిచ్యుయేషన్‌లో అప్‌కమింగ్‌ రీమేక్స్‌ నార్త్ ఇండస్ట్రీని గాడిలో పెడతాయా..? ఈ విషయంలో రీసెంట్‌ ఎక్స్‌పీరియన్సెస్‌ ఏం ప్రూవ్ చేస్తున్నాయంటే పుష్ప, ట్రిపులార్, కేజీఎఫ్‌ లాంటి సౌత్‌ సినిమాలు నార్త్ మార్కెట్‌లో సంచనాలు సృష్టిస్తున్నాయి. దీంతో దక్షిణాది హవాను అడ్డుకునేందుకు నార్త్ మేకర్స్‌ కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నారు. బాహుబలి టైమ్‌లో బాలీవుడ్‌ ఓన్‌ ఫార్ములాస్‌తోనే సౌత్‌ సినిమాను ఢీకొన్న నార్త్‌ మేకర్స్‌ అప్పట్లో పెద్దగా సక్సీడ్ కాలేకపోయారు. ఆమిర్‌ఖాన్ చేసిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ డిజాస్టర్ కావటంతో తరువాత బాలీవుడ్‌ ఫ్యూచర్ మీద అనుమానాలు మొదలయ్యాయి.

కోవిడ్ తరువాత సిచ్యుయేషన్ పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా మార్కెట్‌ను సౌత్ సినిమా పూర్తిగా క్యాప్చర్ చేసేసింది. బాలీవుడ్ సినిమా మాత్రం రీజినల్ సెగ్మెంట్‌లో కూడా మినిమమ్‌ బజ్ క్రియేట్ చేయలేక తంటాలు పడుతోంది. దీంతో సౌత్‌ స్పీడ్‌కు బ్రేకులేసేందుకు సౌత్ సినిమానే ఆయుధంగా తీసుకుంది బాలీవుడ్. దక్షిణాదిలో హిట్టయిన సినిమాలను నార్త్‌లో రీమేక్‌ చేసేందుకు క్యూ కడుతున్నారు బాలీవుడ్‌ దర్శక నిర్మాతలు. అల వైకుంఠపురములో, హిట్, నాంది, ఛత్రపతి, ఆకాశం నీ హద్దురా, విక్రమ్ వేద, ఖైదీ.. ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే దాదాపు పాతిక సినిమాల దాకా ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతున్నాయి. మరో పది సినిమాలు డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి. సౌత్‌ కంటెంట్‌ మీద ఇంత గట్టిగా డిపెండ్ అవుతోంది బాలీవుడ్ ఇండస్ట్రీ. అయితే ఇప్పుడిప్పుడే.. రీమేక్‌ ఫార్ములాను మరీ ఇంత గుడ్డిగా నమ్ముకోవటం కరెక్ట్ కాదన్న వాదన వినిపిస్తోంది.

దృశ్యం, కబీర్ సింగ్‌ లాంటి సినిమాలు సూపర్ హిట్ అయినా.. ప్రతీసారీ సౌత్‌ కంటెంట్‌ నార్త్‌లో సక్సెస్‌ అవుతుందన్న గ్యారెంటీ అయితే లేదు. రీసెంట్‌గా బాలీవుడ్‌లో రిలీజ్ అయిన సౌత్ రీమేక్ జెర్సీకి పాజిటివ్ టాక్ వినిపిస్తున్నా.. వసూళ్ల పరంగా ఆశించిన స్థాయిలో లేదన్నది విశ్లేషకుల మాట. దీంతో ఇప్పుడు సెట్స్ మీద ఉన్న రీమేక్ సినిమాల మేకర్స్‌ అందరూ డైలమాలో పడ్డారు. మరి.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌ అన్నీ రీమేక్‌ ట్రెండ్‌కు ప్లస్ అవుతాయా..? లేక మైనస్ అవుతాయా..? అన్నది చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి 

Hindi language Row: దేశవ్యాప్తంగా రాజుకంటున్న భాషా వివాదం.. పులుముకుంటున్న రాజకీయరంగు!

Richa Gangopadhyay : పెళ్లితర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మిర్చి బ్యూటీ.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

Nandamuri Balakrishna: నో గ్యాప్ అంటున్న నటసింహం.. స్పీడ్ పెంచిన బాలయ్య.. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌తో బిజీ బిజీ