Nandamuri Balakrishna: నో గ్యాప్ అంటున్న నటసింహం.. స్పీడ్ పెంచిన బాలయ్య.. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌తో బిజీ బిజీ

మెగాస్టార్ ఆచార్యతో ఇలా బిజీగా వుంటే.. మిగతా సీనియర్ల కేరాఫ్ ఎక్కడ అని ఆరా తీస్తోంది ఫిలిమ్‌నగర్. చిరూకు సరిసమానంగా పోటీనివ్వడంలో ఆయన కొలీగ్స్‌ చేస్తున్న కసరత్తు ఎక్కడిదాకా వచ్చినట్టు..

Nandamuri Balakrishna: నో గ్యాప్ అంటున్న నటసింహం.. స్పీడ్ పెంచిన బాలయ్య.. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌తో బిజీ బిజీ
Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 28, 2022 | 8:41 PM

మెగాస్టార్(Chiranjeevi )ఆచార్యతో బిజీగా వుంటే.. మిగతా సీనియర్ల కేరాఫ్ ఎక్కడ అని ఆరా తీస్తోంది ఫిలిమ్‌నగర్. చిరూకు సరిసమానంగా పోటీనివ్వడంలో ఆయన కొలీగ్స్‌ చేస్తున్న కసరత్తు ఎక్కడిదాకా వచ్చినట్టు.. ఇంతకూ నందమూరి హీరోపై వినిపిస్తున్న ఆ కొత్త రూమర్లేంటి అనుకుంటున్నారా.. సైరా తర్వాత పెద్ద గ్యాపొచ్చినా.. ఆచార్య సక్సెస్‌తో దాన్ని విజయవంతంగా ఫుల్‌ఫిల్ చేస్తాననే భరోసా కనిపిస్తోంది మెగాస్టార్ దగ్గర. ఆ తర్వాత కూడా సాలిడ్ లైనప్‌తో బలంగా కనిపిస్తున్నారు చిరూ. అటు.. పోటీలో మేమూ వున్నాం అంటూ జోష్ చూపిస్తున్నారు ఆయన సమకాలీనులు. అఖండతో బాక్సాఫీస్ తలుపులు బార్లా తెరిచిన బాలయ్య(Nandamuri Balakrishna).. ఇప్పుడు గోపీచంద్ మలినేనితో మరో పర్‌ఫెక్ట్‌ యాక్షన్‌ డ్రామా చేస్తున్నారు.

బాలయ్యకు మోకాలి సర్జరీ జరిగినట్టు వచ్చిన వార్తల్ని కొట్టిపారేస్తూ, అది జస్ట్ రెగ్యులర్ చెకప్ మాత్రమే అని క్లారిటీనిచ్చింది నందమూరి కాంపౌండ్. సారధీ స్టూడియోస్‌లో జరుగుతున్న తాజా షెడ్యూల్‌లో పార్టిసిపేట్ చేశారని, నో మోర్ ఫియర్స్ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. జూన్ 10న ఎన్‌బీకే 107 టీజర్ వస్తుందని, ఆగస్టులో అనిల్‌రావిపూడి సినిమా స్టార్ట్ అవుతుందని కూడా హింట్ ఇచ్చింది బాలయ్య క్యాంప్. ప్రస్తుతానికి ఎఫ్‌3కి ఫినిషింగ్ టచెస్ ఇస్తూ విక్టరీ హీరో వెంకీ లైనప్‌ని స్ట్రాంగ్‌గా డిజైన్ చేస్తున్నారు పటాస్ డైరెక్టర్ అనిల్. సమ్మర్‌ సీజన్‌లో రాబోయే నెక్స్ట్ థండర్ మూవీ వెంకీదే మరి. మరో సీనియర్ హీరో నాగార్జున… వైల్డ్‌డాగ్‌తో డీలా పడ్డప్పటికీ బౌన్స్‌బ్యాక్ మూవీ కోసం ట్రయల్ వేస్తూనే ఉన్నారు. బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర, ప్రవీణ్‌సత్తారు యాక్షన్ అడ్వెంచర్ ‘ది ఘోస్ట్‌’…. బంగార్రాజు కెరీర్‌లో లేటెస్ట్ గోల్డెన్‌ లైన్స్‌.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Samantha Birthday: సమంతకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన విజయ్.. దెబ్బకు షాక్ అయిన సామ్

Aha OTT: రెట్టింపు ఉత్సాహంతో రెడీ అయిన గేమ్ షో.. ‘సర్కార్’ సీజన్ 2 రాబోతుంది.

Sammathame: ‘సమ్మతమే’ అంటున్న కుర్ర హీరో.. కిరణ్ అబ్బవరం మూవీ రిలీజ్ అయ్యేది అప్పుడే..