AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha Birthday: సమంతకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన విజయ్.. దెబ్బకు షాక్ అయిన సామ్

అందాల భామ సమంత ప్రస్తుతం తెలుగు తమిళ్ సినిమాలతో పటు హిందీలోనూ ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ చిన్నది

Samantha Birthday: సమంతకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన విజయ్.. దెబ్బకు షాక్ అయిన సామ్
Samantha And Vijay Devarako
Rajeev Rayala
|

Updated on: Apr 28, 2022 | 8:14 PM

Share

అందాల భామ సమంత(Samantha) ప్రస్తుతం తెలుగు తమిళ్ సినిమాలతో పటు హిందీలోనూ ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ చిన్నది. నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు. సమంత బర్త్  డే సందర్భంగా ఈ చిన్నదానికి అభిమానులు, సినిమా తారలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సామ్ నటిస్తున్న సినిమాలనుంచి పోస్టర్లు, గ్లిమ్ప్స్ తో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)కూడా సామ్ కు ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు. సమంత విజయ్ దేవరకొండ కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ ఇద్దరు ఓ అందమైన ప్రేమ కథలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. నేడు సమంత బర్త్ డే సందర్భంగా   ఓ ఫేక్ సీన్ తో సామ్ ని సర్ప్రైజ్ చేశాడు విజయ్.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతోంది. శివ నిర్వాణ ఓ ఫేక్ సీన్ ని రాసుకుని సామ్ తో రిహార్షల్ చేయించారు. విజయ్ కూడా ఇది నిజమే అన్నట్లు సామ్ ని నమ్మించాడు. శివ నిర్వాణ యాక్షన్ చెప్పగానే.. సీన్ మొదలైంది. ఒంటరిగా కూర్చున్న విజయ్ దగ్గరగ సమంత వచ్చి ‘పది రోజుల్లో వచ్చేస్తాను.. నువ్వు మా పేరెంట్స్ తో మాట్లాడటం కాదు.. నేనే మీ వాళ్ళతో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తా..’ అని సమంత డైలాగ్ చెబుతోంది. అయితే విజయ్ ఆమె చెంపలను తాకుతూ ‘సమంత’ అని చెప్పడంతో ఒక్కసారిగా సమంత నువ్వేసింది. ఆతర్వాత విజయ్ హ్యాపీబర్త్ డే అని చెప్పడంతో సెట్లో ఉన్నవాళ్ళంతా ఒక్కసారిగా సామ్ కు విషెస్ చెప్పి కేక్ కట్ చేయించారు. దాంతో సమంత ఆనందంలో తేలిపోయింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Virat Kohli: సమంత పాటకు కోహ్లీ ఊర మాస్ స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

Ram Gopal Varma: నార్త్ స్టార్స్ అసూయతో ఉన్నారు.. కిచ్చా సుదీప్‏కు సపోర్ట్‏గా ఆర్జీవీ ట్వీట్..

Happy Birthday Samantha : టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సమంత.. క్వీన్ ఆఫ్ హార్ట్స్‏గా నిలబెట్టిన సినిమాలు ఇవే..