- Telugu News Photo Gallery Cinema photos Samantha Birthday Special here is the list of top 5 movies Samantha acted with different roles in telugu
Happy Birthday Samantha : టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సమంత.. క్వీన్ ఆఫ్ హార్ట్స్గా నిలబెట్టిన సినిమాలు ఇవే..
ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా దూసుకుపోతుంది సమంత. 2010లో ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్గా మారింది. సామ్లో ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమాలు ఇవే..
Updated on: Apr 28, 2022 | 12:00 PM

ఏమాయ చేసావే (2010).. నాగ చైతన్య అక్కినేని, సమంత కలిసి నటించిన సినిమా ఏమాయ చేశావే. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో జెస్సీ పాత్రలో ఒదిగిపోయింది సామ్. ఇందులో చైతూ.. సామ్ జోడి తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

రంగస్థలం.. (2018) అత్తారింటికి దారేది, ఈగ వంటి సూపర్ హిట్ చిత్రాల అనంతరం.. సామ్ డైరెక్టర్ సుకుమార్.. రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమాలో నటించింది. ఇందులో రామలక్ష్మి అనే గ్రామీణ యువతిగా పూర్తిగా డీగ్లామర్ లుక్కులో కనిపించి ఆకట్టుకుంది. రంగమ్మ, మంగమ్మ పాటలో సామ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఓ.. బేబీ (2019) ఎప్పుడూ హీరోయిన్గా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న సామ్.. మునుపెన్నడూ లేనివిధంగా పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో ఓ...బేబీ సినిమాలో నటించింది. 2019లో డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

మజిలీ (2019) డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగచైతన్య జంటగా నటించిన మజిలీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేమలో విఫలమైన ప్రేమికుడిని పెళ్లి చేసుకుని అతడిని మళ్లీ జీవితం గురించి ఆలోచించేలా.. ఎప్పుడూ మద్ధతు ఇచ్చే భార్య పాత్రలో సమంత అద్బుతంగా నటించింది. ఇందులో సామ్ నటనకు తెలుగు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

జాను (2020) తమిళ్ చిత్రం 96 తెలుగు రీమేక్ గా జాను సినిమా తెరకెక్కింది. ఇందులో శర్వానంద్, సమంత ప్రధాన పాత్రలో పోషించారు. కాలేజీ లైఫ్ లో విడిపోయిన ప్రేమికులు చాలా కాలం తర్వాత తిరిగి కలుసుకోవడం.. ఆ తర్వాత వీరిద్ధరి మధ్య ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేదే జాను చిత్రం. ఈ సినిమా ఆశించినస్థాయిలో హిట్ కాలేకపోయిన సామ్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.





























